ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీలో ‘కోత’

  • IndiaGlitz, [Wednesday,May 01 2019]

ప్రభుత్వం బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. మే-01 నుంచి కొత్త వడ్డీ రేట్ల విధానం అమల్లోకి తెచ్చింది. కాగా అధిక డిపాజిట్‌ కలిగిన పొదుపు ఖాతాలు, స్వల్పకాలిక రుణాల వడ్డీ రేట్లను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానించనున్నట్లు మార్చిలో ఎస్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌బీఐ పరపతి సడలింపు ప్రయోజనాలను సత్వరమే కస్టమర్లకు చేరవేసేందుకు వడ్డీ రేట్లను రెపో‌తో లింక్‌ చేయాలని నిర్ణయించింది. కాగా.. ఈ అనుసంధానం బుధవారం (మే-01) నుంచి అమల్లోకి వచ్చింది. గత రెండు సమీక్షల్లో ఆర్‌బీఐ రెపో రేటును వరుసగా పావు శాతం చొప్పున తగ్గించింది. దాంతో ప్రస్తుత రెపోరేటు 6 శాతంగా ఉంది.

తగ్గింపు...

ఇప్పటివరకూ ఈ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా.. కస్టమర్‌కు వడ్డీ 3.5 శాతం అందేది. అయితే ఇకపై ఖాతాలో రూ.లక్ష దాటి ఉంటే వడ్డీరేటును ఎస్‌బీఐ తాజాగా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ తరహా కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. 2018 డిసెంబర్‌ నాటికి ఎస్‌బీఐ దేశీయ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్ల విలువ దాదాపు రూ.10.64 లక్షల కోట్లు అన్న సంగతి తెలిసిందే. కాగా ఇది ఎస్‌బీఐ ఖాతాదారులకు ఒకింత షాకింగ్ వార్తే అని చెప్పుకోవచ్చు.!

More News

'లక్ష్మీస్ ఎన్టీఆర్' వ్యవహారం: ఆర్జీవీకి చంద్రబాబు పంచ్!

టాలీవుడ్ సంచలన దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మే-01న ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.

మావోల రివెంజ్..15 మంది కమాండోలు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం మధ్యాహ్నం మూడు డజన్ల వాహనాల్ని తగలబెట్టారు.

'మే' డే వేడుకల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్...

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రం అట్టుడికిన సంగతి తెలిసిందే. బోర్డు తప్పిదాలతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

'ఎంతవారలైనా' ఆడియో, ట్రైలర్‌ చాలా బాగుంది.. సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది - నిర్మాత కె.అచ్చిరెడ్డి

సంహిత, చిన్ని - చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నటిస్తూ..

'ఇస్మార్ట్ శంక‌ర్' కు స్ఫూర్తి ఆ చిత్ర‌మేనా?

సాధార‌ణంగా మ‌న టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో చాలా మంది ఇత‌ర భాషా చిత్రాల నుండి ప్రేర‌ణ పొంది క‌థ‌ల‌ను త‌యారు చేసుకుంటారు.