'సవ్యసాచి' మూవీ ట్రైలర్ లంచ్ వేడుక..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ' సవ్యసాచి'.. నిధి అగర్వాల్ కథానాయిక.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.. నవంబర్ 2 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ కాగా ఆ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి చిత్ర సాంకేతినిపుణులు, నటీనటులు హాజరు కాగా ముఖ్య అతిధిగా దర్శకుడు సుకుమార్ హాజరయ్యి ట్రైలర్ ని రిలీజ్ చేశారు..
సుకుమార్ మాట్లాడుతూ.. చాల వెరైటీ సబ్జెక్టు ఇది.. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి స్టోరీ ఇప్పటి వరకు రాలేదు.ఇలాంటి సబ్జెక్టు తో సినిమా చేయడం చందు అదృష్టం.. విచిత్రమైన కథ ఇది.. కార్తికేయ లాంటి సినిమా తీసిన చందుకు మరో సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.. కీరవాణి గారు ఈ సినిమా కి మ్యూజిక్ అందించడం గొప్ప విషయం.. అయన సినిమా చూసే చేశారంటేనే సినిమా హిట్ అని అర్థమవుతుంది.. ప్రొడ్యూసర్స్ మంచి సబ్జక్ట్స్ ఎంచుకున్నారు.. మంచి ఫాస్ట్ గా ఉంటారు.. నచ్చిందంటే వెంటనే చేసేస్తారు.. చాల మంచివారు.. వారికి ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను.. చైతు చాల అందంగా ఉన్నాడు.. ట్రైలర్ చూస్తుంటే చాల బాగా చేసాడనిపిస్తుంది..అల్ ది బెస్ట్ అన్నారు..
ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్ ముగ్గురు చాల డెడికేటెడ్ వ్యక్తులు.. అందరితో మంచి గ ఉంటూ మంచి సినిమాలు తీస్తున్నారు.. చందు తో అనుబంధం చాల బాగుంది.. చందు నేచర్ తో ఎంతో కనెక్ట్ అయ్యాను.. ఈ జర్నీ లో ఎన్నో సార్లు తిట్టాను.. కాసురుకున్నాను. అన్ని మర్చిపోయి మళ్ళీ అన్ని మన మంచికోసమే గా చెప్పేది అనుకుని రిఫ్రెష్ అయ్యేవాడు.. చాల మంచి గుణం. చైతు సినిమాలో చాల బాగా చేసాడు.. అన్నారు..
నాగచైతన్య మాట్లాడుతూ.. నా కెరీర్ లో ప్రేమమ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చందు తో సవ్యసాచి చేయడం బాగుంది.. స్టోరీ చెప్పిన వెంటనే సినిమాకి ఒకే చెప్పాను.. ఈ సినిమా కంటెంట్ ను నమ్మి సినిమా తీసిన మైత్రీ మూవీ మేకర్స్ కి చాలా థాంక్స్.. చాలా గొప్ప గొప్ప వాళ్ళు పనిచేశారు ఈ సినిమాకి.. నమ్మలేకపొతున్నాను.. మా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది..ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్ రిలీజ్ అయ్యాక చాల మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు.. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు.. కీరవాణి గారికి చాల థాంక్స్.. మీ సపోర్ట్ మర్చిపోలేనిది.. ఈనెల 27 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది.. నవంబర్ 2 న సినిమా రిలీజ్ కాబోతుంది అన్నారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments