అభిమన్యుడు కాదు.. అర్జునుడు
Send us your feedback to audioarticles@vaarta.com
నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'సవ్యసాచి'. నవంబర్ 2న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. హీరో ఎడమచేయి అసంకల్పితంగా పని చేస్తుంటే ఎలా ఉంటుంది? అసలు హీరో ఎడమ చేయి అలా పనిచేయడానికి ఏదైనా కారణం ఉందా? అని తెలుసుకోవాలంటే సవ్యసాచి సినిమా చూడాల్సిందే.
ట్రైలర్ చూస్తే.. టీజర్లో చూపించిన ఎడమ చేయి వాటం అనే కాన్సెప్ట్‌ను ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో పాటు మాధవన్ విలనిజాన్ని మరో కోణంలో ఎలివేట్ చేశారు. నిధి అగర్వాల్ గ్లామర్ ఎక్స్ట్రా ఎసెట్ అయ్యేలా ఉంది. నిధితో లవ్ పార్ట్‌లో హీరో ఎడమచేయి ఏం చేసిందనే విషయాన్ని కామెడీ టచ్‌లో కాస్త చూపించారు.
"ప్రేమ.. కోపంలాంటి భావోద్వేగాలు మీకొస్తే మీరు మాత్రమే రియాక్ట్ అవుతారు. అదే నాకొస్తే నాతో పాటు ఇంకొకడు కూడా రియాక్ట్ అవుతాడు. వాడే నా ఎడమ చెయ్యి..."అని చైతన్య చెప్పే డైలాగ్
"వీడ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో పడిపోయిన అభిమన్యుడులా" ఉన్నాడని విలన్ మాధవన్ అంటే పక్కనున్న తాగుబోతు రమేశ్ మీరన్నది కరెక్టే సార్..కానీ అభిమన్యుడిలా కాదు సార్.. అర్జునుడిలా.."
"చావైనా నిన్ను చేరాలంటే నీ ఎడమ చేయిని దాటాలి" అని రావు రమేశ్ చైతన్యతో చెప్పే డైలాగ్.. యాక్షన్ సీన్స్ అన్ని హీరో క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com