'సవ్యసాచి' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Sunday,February 18 2018]

'ప్రేమ‌మ్' వంటి హిట్ చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

కాగా, ఈ చిత్రంలో సీనియ‌ర్ క‌థానాయిక భూమిక ఓ కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య‌కి అక్క పాత్ర‌లో క‌నిపించ‌నున్న భూమిక‌. ప్ర‌స్తుతం విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం మార్చికంతా సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమాను మే 24న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.