మార్చి 18న 'సవ్యసాచి' ఫస్ట్ లుక్ , జూన్ 14న సినిమా రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
"ప్రేమమ్" లాంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా.. "సవ్యసాచి" ఫస్ట్ లుక్ మరియు రిలీజ్ డేట్ లను ఎనౌన్స్ చేసారు మైత్రీ మూవీ మేకర్స్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ లు మాట్లాడుతూ.. "మా యూనిట్ సభ్యులందరికీ "సవ్యసాచి" ఒక స్పెషల్ ఫిలిమ్. ప్రస్తుతం హైద్రాబాద్ లో హీరో నాగచైతన్య, భూమికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే "సవ్యసాచి" చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక "బాహుబలి" తర్వాత కీరవాణి గారు "సవ్యసాచి"కి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది" అన్నారు.
నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చిరు), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందు మొండేటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com