నారా రోహిత్ 'సావిత్రి' సాంగ్ రిలీజ్

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

నారా రోహిత్..., యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో. నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. సినిమా మార్చి 25న విడుదల అవుతుంది. సినిమా ప్రస్తుతం హైదరాబాద్ నానక్ రామ్ గూడ రామానాయుడులో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నారారోహిత్ పాడ పాడటం విశేషం. ఈ సాంగ్ రిలీజ్ ను లోకేషన్ లో సాయికొర్రపాటి విడుదల చేశారు.

నారారోహిత్ మాట్లాడుతూ 'తొలిసారి పాట పాడాను. సోలో తర్వాత ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది. నేను, పవన్ ఈ సినిమా కోసం రెండేళ్ళుగా ట్రావెల్ చేస్తున్నాం. తప్పకుండా మంచి మూవీ అవుతుంది'' అన్నారు.

నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 'సావిత్రి చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మార్చి 4న ఆడియో 25న సినిమా రిలీజ్ ఉంటుంది. రోహిత్ పాటను చక్కగా పాడాడు'' అన్నారు.

దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ 'రోహిత్ నాకు బ్రదర్ లాంటివాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుంది. మార్చి 4న ఆడియో, మార్చి 25న మూవీ రిలీజ్ ఉంటుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో నందిత, కృష్ణచైతన్, వసంత్, మధునందన్ తదితరులు పాల్గొన్నారు.

More News

ఆ ఇద్ద‌రి భామ‌ల‌ను ఫైన‌ల్ చేసిన మెగా హీరో

మెగా హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం సుప్రీమ్ సినిమాలో న‌టిస్తున్నారు. ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న సుప్రీమ్ ఏప్రిల్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

దేవాలయాలు ప్రారంభించిన అగ్ర హీరోలు..

హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే.ఈ ప్రాముఖ్యతను మరింత పెంచేలా ఈ దైవ సన్నిధానంలో మరిన్ని దేవాలయాలను ఏర్పాటు చేసారు.

ఆ వార్తల్లో వాస్త‌వం లేదంటున్న చిరు

కేంద్ర మాజీ మంత్రి, రాజ్య‌స‌భ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి బి.జె.పి లో చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లోఅయితే   చిరు బి.జె.పి కి ద‌గ్గ‌ర‌వుతున్నాడ‌ని...ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సి.ఎం అభ్య‌ర్ధిగా చిరంజీవిని  బి.జె.పి ప్ర‌క‌టించ‌నుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

బ్రహ్మోత్సవం లో మహేష్ కుమార్తె..

సూపర్ స్టార్ మహేష్ -శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందుతున్న బ్రహ్మోత్సవం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

తమిళ టీ.విలో వ్యాఖ్యాతగా తెలుగు హీరో...

తమిళ టీ.వి లోవ్యాఖ్యాత గా తెలుగు హీరోనా..?ఎవరా హీరో అనుకుంటున్నారా..?దగ్గుబాటి రానా.