క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచిన సావిత్ర సీరియల్ యూనిట్
- IndiaGlitz, [Tuesday,November 17 2015]
గత 200 ఎపిసోడ్స్ గా బుల్లి తెర అభిమానులను అలరిస్తున్న ' సావిత్రి ' సీరియల్ టీమ్ ..క్యాన్సర్ భాదితులకు అండగా నిలిచింది..ఈ సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా సావిత్రి సీరియల్ యూనిట్ ఒక్కరోజు వేతనాన్ని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ నందమూరి బాలకృష్ణను డిక్టేటర్ షూటింగ్ లోకేషన్ లో కలిసి లక్ష రూపాయాలకు విరాళం అందజేశారు .బాలయ్యను కలిసిన వారిలో సీరియల్ నిర్మాత డి.వై చౌదరి ,టి.వి ఫెడరేషన్ ప్రెసిడెంట్ యాదవ్ విజయ్ యాదవ్ , నటి పల్లవి ,నటీనటులు ,సాంకేతికనిపుణులు ఉన్నారు.
సీరియల్ నిర్మాత డి.వై చౌదరి మాట్లాడుతూ : ఈటివీలో ప్రసారమౌవుతున్న సావిత్రి సీరియల్ ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తూ ..మమ్మల్ని ఆశీర్వాదిస్తున్నారు..సీరియల్ ప్రారంభం నుంచి 200 ఎపిసోడ్స్ వరకు వెళ్లడానికి నటీనటుల , టెక్నిషియన్స్ కృషి గా కూడా ఉందని తెలిపారు..మా బ్యానర్ లో నిర్మించిన అన్ని సీరియల్స్ ను తెలుగు టివి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు..దానిలో భాగంగానే మా సావిత్రి సీరియల్ ను అభిమానిస్తున్నారు..అందుకు ఓ మంచి పనిచేయాలనే ఉద్దేశ్యంతో మా సీరియల్ యూనిట్ అందరం కలిసి ఒక్కరోజు వేతనం 'ఒక లక్ష రూపాయాలను ' బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ నందమూరి బాలకృష్ణ కు అందజేయడం ఆనందంగా ఉందన్నారు..నా నిర్ణయాన్ని గౌరవించిన యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
టివి ఫెడరేషన్ అద్యక్షుడు , నటుడు : విజయ్ యాదవ్ మాట్లాడుతూ : సావిత్ర సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.. నిర్మాత డి.వై చౌదరి ఒక మంచి పనిచేయాలని అందరిని కోరడం..అందరం కలిసి క్యాన్సర్ బాదితుల చికిత్స కొరకు తమవంతు సహాకారం అందించడం ఆనందంగా ఉందన్నారు..భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీం అందరం ముందుంటాం అని తెలిపారు.