'సావిత్రి' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్..., యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో. నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. సినిమా మార్చి 25న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా....
చిత్ర నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ` ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఇద్దరి పెయిర్ చాలా చక్కగా ఉంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నాం" అన్నారు.
దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ, " ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తర్వాత నా డైరెక్షన్ లో వస్తున్న సినిమా . ఇప్పుడు నారా రోహిత్ తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి లవ్ అండ్ కమర్షియల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి 25న విడుదల చేస్తున్నాం" అని అన్నారు.
నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు
సాంకేతిక విభాగం : సినిమాటోగ్రఫీ - వస్సంత్ , డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు , ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com