'సావిత్రి' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

నారారోహిత్ హీరోగా విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై పవన్ సాధినేని దర్శకత్వంలో డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సావిత్రి. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా....

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ' సావిత్రి అనే చక్కటి టైటిల్ పెట్టినందుకు యూనిట్ ను అభినందిస్తున్నాను సినిమా నేపథ్యం చూస్తుంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా కనపడుతుంది.. నారారోహిత్ తన స్టయిల్ లో మేథడికల్ యాక్టింగ్ తో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నాడు. శ్రవణ్ మంచి మ్యూజిక్ అందించాడు. పాటలు బావున్నాయిఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నారారోహిత్ మాట్లాడుతూ 'పెద్ద నాన్న చంద్రబాబునాయుడుగారు, నాన్నగారు నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళతాననగానే ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా కథతో రెండేళ్లు నుండి ట్రావెల్ చేస్తున్నాం. మంచి నిర్మాత రాజేంద్రప్రసాద్ దొరకడంతో సినిమా క్వాలిటీగా వచ్చింది. పవన్ సాధినేని సినిమాను బాగా హ్యండిల్ చేశాడు. శ్రవణ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సోలో తర్వాత అలాంటి సినిమా సావిత్రి అవుతుంది. ఆ సినిమాలాగానే ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ థాంక్స్'' అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ 'అద్భుతమైన టీం రూపొందించిన సినిమా సావిత్రి. సోలో తర్వాత ఈ సినిమా పవన్ బావ, నారారోహిత్ బావకు పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ'' ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఎటువంటి వల్గారిటీ లేకుండా చక్కగా ఉంటుంది. నారారోహిత్ గారి ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అవుతుంది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.

డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ 'నిర్మాత రాజేంద్రప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. మా అందిరికీ పెద్దన్నయ్యలా ఉండి, సపోర్ట్ చేశారు. శ్రవణ్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. ప్రేమ ఇస్క్ కాదల్ వంటి యూత్ సబ్జెకట్ తర్వాత సావిత్రి వంటి ఫ్యామిలీ మూవీ చేశాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ 'ఈ ఆల్బమ్ లో నారా రోహిత్ గారు పాడటటమే హైలైట్. చాలా డేడికేషన్ తో సాంగ్ పాడారు. ఆ పాట పెద్ద హిట్టయింది. పవన్ సాధినేనితో మంచి పరిచయం ఉంది. అవకాశం ఇచ్చి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.

ఈ కార్యక్రమానికి సాయికొర్రపాటి, నందిత, బెక్కంవేణుగోపాల్, శ్రద్ధాదాస్, వసంత్, ప్రవీణ్ సత్తారు, రష్మీ గౌతమ్ తదితరులు హాజరై యూనిట్ ను అభినందించారు.

More News

సునీల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణాష్టమి ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.

ఆ లిస్ట్ లో...మాస్ రాజా రవితేజ....

మాస్ మహారాజా రవితేజ ఏ లిస్ట్ లో చేరాడు అని తెగ ఆలోచిస్తున్నారా..?

బాలీవుడ్ వెళుతున్న టాలీవుడ్ యాక్టర్....

రీసెంట్ గా క్షణం చిత్రంతో సక్సెస్ అందుకున్న అడవిశేష్ పై అందరి దృష్టి ఉంది.

'శ్రీశ్రీ' చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్

సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా,శ్రీమతి విజయనిర్మల కథానాయికగా కలిసి నటంచిన ఎస్.బి.ఎస్.ప్రొడక్షన్స్ సంస్థ..దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో

'రైట్ రైట్' అంటున్న సాయిధరమ్ తేజ్

ఇద్దరు హీరోల సినిమాల షూటింగ్స్ ఒకే ఏరియాలో పక్క పక్క జరిగితే..ఆ ఇద్దరు హీరోలు బ్రేక్ టైమ్ లో కలుసుకుని,కాసేపు కబుర్లు చెప్పుకుంటారు.