సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ గుండెపోటు కారణంగా శనివారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు హార్ట్ ఎటాక్‌గా నిర్ధారించి ఆపరేషన్ చేయాలని సూచించారు. గంగూలీ శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా.. ఉన్నట్లుండి తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డారు. దీంతో జిమ్ సిబ్బంది ఆయనను హుటాహుటిన దగ్గరలోని ఉడ్‌ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. హృదయపు నాళాల్లో అడ్డంకులు ఏర్పడడమే ఛాతీ నొప్పికి కారణంగా గుర్తించారు. ప్రస్తుతం ఆయనను క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. సాయంత్రంలోపు దాదాకు కరోనరీ యాంజియోగ్రామ్ చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు.
గంగూలీకి చికిత్స నిమిత్తం ఆసుపత్రి యాజమాన్యం ఎస్ఎస్‌కేఎం కార్డియాలజిస్టు సరోజ్ మొండల్ నేతృత్వంలోని ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. చికిత్స పూర్తయిన తరువాత త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. గంగూలీ గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారని తెలియడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ‘గుండెపోటుతో గంగూలీ ఆసుపత్రిలో చేరడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments