సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు..

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ గుండెపోటు కారణంగా శనివారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు హార్ట్ ఎటాక్‌గా నిర్ధారించి ఆపరేషన్ చేయాలని సూచించారు. గంగూలీ శనివారం ఉదయం జిమ్‌ చేస్తుండగా.. ఉన్నట్లుండి తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డారు. దీంతో జిమ్ సిబ్బంది ఆయనను హుటాహుటిన దగ్గరలోని ఉడ్‌ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. హృదయపు నాళాల్లో అడ్డంకులు ఏర్పడడమే ఛాతీ నొప్పికి కారణంగా గుర్తించారు. ప్రస్తుతం ఆయనను క్రిటికల్ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. సాయంత్రంలోపు దాదాకు కరోనరీ యాంజియోగ్రామ్ చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు.

గంగూలీకి చికిత్స నిమిత్తం ఆసుపత్రి యాజమాన్యం ఎస్ఎస్‌కేఎం కార్డియాలజిస్టు సరోజ్ మొండల్ నేతృత్వంలోని ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. చికిత్స పూర్తయిన తరువాత త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. గంగూలీ గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారని తెలియడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ‘గుండెపోటుతో గంగూలీ ఆసుపత్రిలో చేరడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు.

More News

నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌'కు భారీ డీల్‌.. థియేటర్స్‌కు షాక్‌..!

కింగ్‌ నాగార్జున టైటిల్‌ పాత్రలోనటిస్తోన్న చిత్రం 'వైల్డ్‌ డాగ్‌'. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బండీ ఏంటిది.. ఎందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్?

తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు ముఖ్యంగా రెండు పార్టీల్లో ఊహించని మార్పులకు కారణమయ్యాయి.

పవన్‌పై పృధ్వీరాజ్ ప్రశంసలు.. ట్రోల్స్ స్టార్ట్..

నిన్న మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీపై తనదైన శైలిలో విరుచుకుపడిన ప్రముఖ నటుడు పృధ్వీరాజ్..

పవన్‌తో హరీష్ శంకర్ భేటీ.. ముహూర్తం సెట్ అయినట్టే..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశంకర్ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా ప్రారంభమైన టీకా డ్రైరన్..

దేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రైరన్ శనివారం ప్రారంభమైంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా శుక్రవారం ఆస్ట్రాజెనెకా కంపెనీ,