'నోటా'.. స‌త్య‌రాజ్ పాత్ర ఎలా ఉంటుందంటే..

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'నోటా'. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో.. రాజకీయ వారసుడి పాత్ర‌లో విజయ్ నటిస్తున్నారు.

తెలుగు, తమిళ భాష‌ల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సత్యరాజ్ పాత్ర చాలా ప్రత్యేకమంటున్నారు దర్శకుడు ఆనంద్ శంకర్. తనని నమ్ముకున్న ప్రజలకోసం వ్యవస్థను కూడా ఎదిరించే విధంగా ఈ పాత్ర సాగుతుందని.. ఒక విధంగా చెప్పాలంటే 'సర్కార్' చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్రలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు దర్శకుడు.

నాజర్ మ‌రో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి.. సి.ఎస్.శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

ఈ నెల 18న ర‌వితేజ చిత్రం ఫ‌స్ట్ లుక్‌

రవితేజ, మాళవిక శర్మ జంట‌గా నటిస్తున్న చిత్రం 'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న పేరు). కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. తన గత చిత్రాల మాదిరిగానే.. అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు.

పాట చిత్రీక‌ర‌ణ‌లో 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది ఈ చిత్రం.

చిత్రం శీను ప్రధాన పాత్రలొ 'విశ్వదాభిరామ'

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్ , అశోక్ చక్రం త్రయం  దర్శకులు.

తెలుగులోకి మ‌ళ్లీ భాగ్య శ్రీ....

బాలీవుడ్ చిత్రం 'మైనే ప్యార్ కియా' సినిమాను తెలుగులో 'ప్రేమ పావురాలు' పేరుతో  విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌ర్వాత సినిమాల నుండి భాగ్య శ్రీ బ్రేక్ తీసుకున్నారు.

త‌మ‌న్‌.. ఐదోసారి

యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు. 'భాగ‌మ‌తి', 'తొలి ప్రేమ' చిత్రాల విజ‌యాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్‌గా మారిన త‌మ‌న్‌.. ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో తెలుగులో బిజీగా ఉన్నారు.