లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్‌ 'తిమ్మరుసు'

  • IndiaGlitz, [Sunday,October 18 2020]

'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు' ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్‌ అప్పూ ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టారు. రాజా, వేదవ్యాస్‌ స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'తిమ్మరుసు' చిత్రానికి 'అసైన్‌మెంట్‌ వాలి' ట్యాగ్‌లైన్‌.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా..సత్యదేవ్‌ తనకంటూఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. 'తిమ్మరుసు' సినిమా విషయానికి వస్తే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. మంచి టీమ్‌ కుదిరింది. ఈ నెల 21 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నిరవధికంగా జరిగే లాంగ్‌ షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశాం అన్నారు.

నటీనటులు: సత్యదేవ్‌, ప్రియాంకా ఝావల్కర్, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు

More News

మిథున్ చక్రవర్తి కుమారుడిపై అత్యాచార కేసు..

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌పై అత్యాచార కేసు నమోదైంది.

‘అమ్మ’ నీ పెర్ఫార్మెన్సో.. ఆస్కార్ లెవల్..

తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్న షో.. బిగ్‌బాస్. ఈ సారి షోలో పెద్దగా తెలిసిన మొహాలు లేకపోవడంతో ప్రేక్షకులు సైతం మొదట్లో ఆసక్తి కనబరచలేదు.

గ్రేటర్‌లో ‘గులాబీ’ ప్రవాహానికి ‘వరద’ గండికొట్టనుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారినప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా.. టీఆర్ఎస్‌కు సీట్ల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది.

అఫీషియల్‌.. రవితేజ 'ఖిలాడి'

మాస్‌ మహారాజా రవితేజ 67వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడింది.

అఖిల్, మోనాల్‌ను అపార్థం చేసుకున్నావని అభికి చెప్పిన నాగ్..

మైండ్ బ్లాక్ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా ఎవరిపైనా అక్షింతలు వేయకుండా..