బ్లాక్‌మనీపై అస్త్రం : ఆకట్టుకుంటోన్న సత్యదేవ్ ‘‘గాడ్సే’’ టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణమైన కథలతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న యువ హీరో సత్యదేవ్. రోటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా కథకు స్కోప్ వుండే చిత్రాలు చేస్తూ.. సత్యదేవ్ సినిమా అంటే ఏదో విషయం వుందనేంతగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ వైజాగ్ కుర్రాడు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘‘గాడ్సే’’. సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీని గోపి గణేశ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి మొదటి సారి తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే నాసర్, సాయాజీ షిండే, కిషోర్, బ్రహ్మజీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు పెంచగా.. .. తాజాగా ఈ సినిమా లో నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. గాడ్సే టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సోమవారం విడుదలైన ఈ టీజర్‌లో సత్యదేవ్ దుమ్ము లేపాడు. అవినీతి రాజకీయాలను అరికట్టాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా ఆయన కనిపిస్తారు. సత్యదేవ్ కోసం అధికారులు గాలిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మీ ఇన్వెస్ట్‌గేట్ చేసే ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. “ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు…” అంటూ టీజర్ ప్రారంభమవుతోంది.
“సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి… కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నాయా .. ఎందుకంటే మీరంతా సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు” అంటూ సత్యదేవ్ పలికిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అన్నింటికి మించి సునీల్ కశ్యప్ బ్యాక్ ఇచ్చిన గ్రౌండ్ స్కోరు సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న గాడ్సేను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com