స్వీట్ వింటర్ రొమాన్స్ : వాలంటైన్స్ డే కానుకగా ‘‘గుర్తుందా శీతాకాలం’’ ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణమైన కథలతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న యువ హీరో సత్యదేవ్. రోటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా కథకు స్కోప్ వుండే చిత్రాలు చేస్తూ.. సత్యదేవ్ సినిమా అంటే ఏదో విషయం వుందనేంతగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ వైజాగ్ కుర్రాడు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘‘గుర్తుందా శీతాకాలం’’. ఇందులో సత్యదేవ్ పక్కన అగ్ర కథానాయిక తమన్నా సహా మేఘా ఆకాష్, కావ్యశెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు పొలిటికల్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ కథా చిత్రాల్లో నటించిన సత్యదేవ్ తొలిసారి ఓ ఫీల్‌గుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘‘గుర్తుందా శీతాకాలం’’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
''శీతాకాలం... మంచులో మనసులు తడిచి ముద్దయ్యే కాలం. చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం. నా జీవితంలో శీతాకాలానికి ఇంకో పేరు ఉంది. సీజన్ ఆఫ్ మేజిక్'' అని సత్యదేవ్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్కూల్ డేస్‌లో కోమలి, కాలేజ్ డేస్‌లో అమ్ము, జర్నీలో దివ్య అంటూ తన జీవితంలోని ఒక్కొక్క దశలో ఒక్కొక్కరితో హీరో ప్రేమలో పడినట్టుగా ట్రైలర్లో చూపించారు. మరి వీరిలో ఎవరిని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నాడు అన్నదే సినిమా కథ. విజువల్స్, ఫీల్‌గుడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ట్రైలర్ కట్టిపడేస్తోంది.
కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలబైరవ స్వరాలు సమకూర్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments