సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్ సాంగ్‌ రిలీజ్

  • IndiaGlitz, [Saturday,February 05 2022]

విలక్షణమైన కథలతో యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న యువ హీరో సత్యదేవ్. రోటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా కథకు స్కోప్ వుండే చిత్రాలు చేస్తూ.. సత్యదేవ్ సినిమా అంటే ఏదో విషయం వుందనేంతగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ వైజాగ్ కుర్రాడు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘‘గుర్తుందా శీతాకాలం’’. ఇందులో సత్యదేవ్ పక్కన అగ్ర కథానాయిక తమన్నా సహా మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ‘‘గుర్తుందా శీతాకాలం’’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను సంజీత్ హెగ్డే ఆలపించగా, కాలబైరవ స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ‘గాడ్సే’’ అనే మరో చిత్రంలోనూ సత్యదేవ్ నటిస్తున్నారు. సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీని గోపి గణేశ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి మొద‌టి సారి తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే నాస‌ర్, సాయాజీ షిండే, కిషోర్, బ్ర‌హ్మ‌జీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అవినీతి రాజకీయాలను అరికట్టాలనే లక్ష్యంతో ఉన్న యువకుడిగా సత్యదేవ్ కనిపిస్తున్నారు.