ఆత్మాహుతి దాడి చేస్తాననుకుని అరెస్ట్ చేశారు: సత్యదేవ్
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్ స్టార్‌గా పేరు పొందారు సత్యదేవ్. లాక్‌డౌన్ సమయంలో ఆయన సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించాయి. ఆయన సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఓటీటీలో విడుదలైనప్పటికీ మంచి సక్సెస్ టాక్ వచ్చింది. ఆ సినిమా తనను ఊహించనంత స్థాయికి తీసుకెళ్లిందని ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్ తెలిపారు. అయితే అదే ఇంటర్వ్యూలో ఆప్ఘనిస్తాన్‌లో తాను ఎదుర్కొన్న పరిస్థితితులను కూడా వివరించారు. ఓ షూటింగ్ నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లిన సత్యదేవ్‌కూ అనూహ్య పరిస్థితి ఎదురైంది. తన జీవితానికిక అదే ఆఖరు రోజు అనుకున్నానని సత్యదేవ్ వెల్లడించారు.
‘హబీబ్’ అనే హిందీ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లినట్టు సత్యదేవ్ తెలిపారు. అంతేకాకుండా ఆ సినిమా ప్రొడ్యూసర్‌లలో ఒకరిది ఆఫ్ఘనిస్తాన్ కావడంతో అక్కడే షూటింగ్ పెట్టుకున్నామని వెల్లడించారు. నిజానికి ఆ సినిమా మంగళవారం ప్రారంభం కావాల్సి ఉందట. అయితే సెంటిమెంట్ ప్రకారం మంగళవారం వద్దని సోమవారమే ప్రారంభించామని సత్యదేవ్ వెల్లడించారు. కెమెరా నాలుగో అంతస్థులో ఉండగా.. తాను బిల్డింగ్ ముందు ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్లాలని.. ఆ సీన్‌ని చిత్రీకరిస్తున్నామని సత్యదేవ్ తెలిపారు. ఆ షాట్ కోసం మూడు టేకులు తీసుకున్నారట. షూట్ పూర్తయిన అనంతరం చిత్రబృందం ఎలా సీన్ ఎలా వచ్చిందో చూసుకుంటూ బిల్డింగ్‌లోనే ఉండిపోయారని సత్యదేవ్ వెల్లడించారు.
అయితే సత్యదేవ్ ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరగడం చూసిన పోలీసులు.. ఆయనేదో ఆత్మాహుతి బృందం సభ్యుడని భావించి అరెస్ట్ చేశారట. అంతకు ముందు అక్కడ 9 ఆత్మాహుతి దాడులు జరిగాయట. ఇక తన జీవితానికి అదే ఆఖరి రోజు అని భావించానని సత్యదేవ్ తెలిపారు. తనతో పాటు రజాక్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉన్నారట. అక్కడికి పెద్ద సంఖ్యలో జనం వచ్చి
తమను చంపేయాలంటూ బాటిల్స్‌తో దాడికి పాల్పడ్డారని సత్యదేవ్ వెల్లడించారు. పాస్‌పోర్ట్ అడిగినప్పటికీ తమ వద్ద లేకపోవడంతో పెద్ద గొడవే జరిగిందట. ఇండియన్ ఎంబసీ, ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ అదికారులు అక్కడికి చేరుకుని చివరకు ఎలాగోలా గొడవ సద్దుమణగడంతో ఊపిరి పీల్చుకున్నామని సత్యదేవ్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments