సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో అభిషేక్ ఫిలిమ్స్ చిత్రం

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

త‌మిళ 'చ‌తురంగ వేట్టై' ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఆశ, అత్యాశ‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా సాగిన ఈ  క‌థ‌కు త‌మిళ  ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. భావోద్వేగాలకు ప్రాంతీయ భేదాలుండ‌వు. ఎక్క‌డైనా ఈ క‌థ నీరాజ‌నాలు అందుకుంటుంద‌నే న‌మ్మ‌కంతో,  ఆ క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కోసం తెర‌కెక్కిస్తున్నారు  అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై.  ప్రముఖ నిర్మాత  శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. 'జ్యోతిల‌క్ష్మి', 'ఘాజి' చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్నారు. 'ఎక్క‌డికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన  నందితా శ్వేత నాయిక‌గా న‌టిస్తున్నారు. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత ర‌మేష్ పిళ్లై మాట్లాడుతూ '' తొలిసారిగా అభిషేక్ ఫిలిమ్స్ పతాకం ఫై  లారెన్స్ నటించిన శివలింగ తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించి మంచి విజయాన్ని సాధించాము .  త‌మిళంలో ఘ‌న విజ‌యాన్ని సాధించిన  చిత్రం 'చ‌తురంగ వేట్టై', తెలుగులో రీమేక్ చేస్తున్నాం. . ఇప్ప‌టికి 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. కొడైకెనాల్‌, వైజాగ్‌, హైద‌రాబాద్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. తాజాగా హైద‌రాబాద్‌లోనే మార్చి 23 నుంచి షెడ్యూల్ చేస్తున్నాం.

ఇదే ఆఖ‌రి షెడ్యూల్‌. ఏప్రిల్ 15తో పూర్త‌వుతుంది.ఎక్క‌డా రాజీప‌డ‌కుండా హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్కిస్తున్నాం.  డ‌బ్బింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసి జూన్ చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త్వ‌ర‌లో టైటిల్‌ని ప్ర‌క‌టిస్తాం. ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది'' అని అన్నారు. 

చిత్ర స‌మ‌ర్ప‌కులు  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ '' ధ‌నం మూలం ఇద‌మ్ జ‌గ‌త్ అని అంటారు. 'చ‌తురంగ వేట్టై'  డ‌బ్బుకు , మానవతా విలువలకు సంబంధించిన సినిమా. ఇంకా తేట‌గా చెప్పాలంటే ప్రతి మనిషికి ఆశ‌ ఉండడం సహజం . అది అత్యాశగా మారితే ఎలా ఉంటుందనేది ఈ కథలో ప్రధానాంశం.   ప్ర‌స్తుతం జ‌రుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి జూన్ చివ‌రి వారంలో విడుద‌ల చేస్తాం. క‌థ‌, క‌థ‌నం, సంభాష‌ణ‌లు, పాట‌లు హైలైట్ అవుతాయి '' అని చెప్పారు. 

ఆదిత్యామీన‌న్‌, పృథ్వి, బ్ర‌హ్మాజీ, సిజ్జు, త‌నికెళ్ల భ‌ర‌ణి, చైత‌న్య కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, 'దిల్‌' ర‌మేష్‌ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై, స‌మ‌ర్ప‌ణ‌:  శివ‌లెంక‌ కృష్ణ‌ప్ర‌సాద్‌, మాటలు -ద‌ర్శ‌క‌త్వం:  గోపీగ‌ణేష్ ప‌ట్టాభి, క‌థ‌:  హెచ్‌.డి.వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్:  పుల‌గం చిన్నారాయ‌ణ‌ ,సంగీతం:  సునీల్ కాశ్య‌ప్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్:  బ్ర‌హ్మ క‌డ‌లి, కెమెరా:  శివేంద్ర‌కుమార్‌,  , కో డైర‌క్ట‌ర్‌:  కృష్ణ‌కిశోర్‌,  ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్స్:  ఆర్‌.సెంథిల్‌, కృష్ణ‌కుమార్‌.

More News

ఏప్రిల్ 6న గులేబకావళి

నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఇండియన్ మైఖేల్‌జాక్సాన్‌గా పిలుచుకునే ప్రభుదేవాకు తెలుగునాట వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గులేబకావళి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం.

అభిమానులు, అభిమానాన్ని ర‌క్తం దానం చేసి  చూపించారు: నిర్మాత అల్లు అర‌వింద్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు వేడుక‌లు నేడు (మంగ‌ళ‌వారం)  హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లోని  చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో

బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్

గుమ్మడికాయ కొట్టిన ఆటగాళ్లు !!

సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం "ఆటగాళ్లు".

మ‌ల్టీస్టార‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ పాత్ర ఎంటంటే...

ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం రిలీజ్ టెన్ష‌న్‌తో ఉన్న బ‌ర్త్ డే బాయ్ రామ్‌చ‌ర‌ణ్ తదుప‌రి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.