అల్ట్రా స్టైలిష్ లుక్ లో సత్యదేవ్.. సెకండ్ తర్వాత ఫస్ట్ మూవీ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటుడు సత్యదేవ్ దూసుకుపోతున్నాడు. ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన మార్క్ చాటుకుంటున్నాడు. ఘాజి, అంతరిక్షం, బ్రోచేవారెవరురా, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలని గమనిస్తే సత్యదేవ్ ప్రతిభ అర్థం అవుతుంది.
ఇదిలా ఉండగా సత్యదేవ్ మరో విభిన్న ప్రయత్నంతో రాబోతున్నాడు. సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం 'తిమ్మరుసు'. ఈ చిత్రంలో సత్యదేవ్ లీడ్ రోల్ లో లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సత్యదేవ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు.
బైక్ పై సత్యదేవ్ ఓ బ్రీఫ్ కేస్ పట్టుకుని కూర్చుని ఉన్న ఫోజు ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న తొలి తెలుగు చిత్రం ఇదే అని పేర్కొన్నారు.
చిన్న, మీడియం తరహా చిత్రాలన్నీ ఓటిటి బాట పట్టాయి. ఇటీవల నిర్మాతల మండలి, థియేటర్ యాజమాన్యం, టాలీవుడ్ ప్రముఖులు నిర్వహించిన సమావేశంలో అక్టోబర్ వరకు ఓటిటీలలో సినిమాలు రిలీజ్ చేయకూడదు అని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తిమ్మరుసు చిత్రం శరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సత్యదేవ్ ప్రస్తుతం గాడ్సే, రామ్ సేతు లాంటి చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com