పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న 'సత్యా గ్యాంగ్'

  • IndiaGlitz, [Thursday,May 25 2017]

"మన కోసం మనం బ్రతకడం కాదు.. పదిమంది కోసం బ్రతకాలి" అనే నినాదానికి పుష్కలమైన వినోదం జోడించి రూపొందుతున్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సత్యా గ్యాంగ్". సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి ప్రభాస్ నిమ్మలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అభిరుచి గల నిర్మాత మహేష్ ఖన్నా నిర్మిస్తున్న "సత్యా గ్యాంగ్" పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకొంది. చిత్ర నిర్మాత మహేష్ ఖన్నా ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషిస్తోండడం విశేషం. ప్రథ్యూస్, సాత్విక్ హీరోలుగా.. హర్షిత పన్వార్, అక్షిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, మహేష్ ఖన్నా, జీవా, షఫీ, కాలకేయ ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
సిద్ధయోగి క్రియేషన్స్ అధినేత-చిత్ర నిర్మాత మహేష్ ఖన్నా మాట్లాడుతూ.. "ఓ చక్కని సందేశానికి చిక్కని వినోదం జోడించి తెరకెక్కిస్తున్న "సత్యా గ్యాంగ్" చిత్రాన్ని మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఎంతో నిబద్ధతతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న తమ స్నేహితుడి కోసం అతని మిగతా స్నేహితులు ఏం చేశారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. నేను కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. నటుడిగా, నిర్మాతగా నాకు మంచి గుర్తింపు ఇస్తుందని నమ్ముతున్నాను. పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. బ్యాంకాంక్ లో పాటలు షూట్ చేయనున్నాం" అన్నారు.
చిత్ర దర్శకులు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. "నన్నూ, నా కథను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మహేష్ ఖన్నాగారిని నేను జీవితాంతం మర్చిపోలేను. ఆయన ప్రోత్సాహంతోనే "సత్యా గ్యాంగ్" చాలా బాగా వస్తోంది. ప్రథ్యూస్, సాత్విక్, హర్షిత, అక్షితలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇక సుమన్, కాలకేయ ప్రభాకర్, జీవా, షఫీ వంటి సీనియర్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది" అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, పాటలు: చంద్రబోస్, నిర్మాత: మహేష్ ఖన్నా, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల !!

More News

'మామ్' చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెబుతున్న శ్రీదేవి

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ఐ పిక్చర్స్ పతాకాలపై 'మామ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'వైశాఖం' థీమ్ టీజర్ కి 1.3 మిలియన్ వ్యూస్

డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయ్యాయి. వాటన్నింటినీ మించి లేటెస్ట్గా జయ బి. దర్శకత్వంలో రూపొందిన 'వైశాఖం' ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేసిన 'వైశాఖం' థీమ్ టీజర్కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

నిర్మాతకు జీవిత ఖైదు...

సమరసింహారెడ్డి, నరసింహుడు చిత్రాల నిర్మాత చెంగల వెంకట్రావుకు అనకాపల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విదించింది. పదేళ్ళ క్రితం నక్కపల్లి మండలంలో బంగారమ్మ పేటలో బి.ఎం.సి కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవల్లో గోసల కొండ అనే మత్య్సకారుడు చనిపోయాడు.

చైనాపై బాహుబలి దండయాత్ర

చైనా బాక్సాఫీస్ వద్ద దంగల్ యుద్ధం చేస్తూ 500 కోట్లను దాటి 1000 కోట్లను చేరువ అవుతుంది. ఈ యుద్ధం ముగిసే లోపలే, చైనాపై బాహుబలి దండయాత్ర మొదలుకానుంది.

వెయ్యి కోట్ల సినిమాకు అప్పుడే కష్టాలు...

ఇండియన్ సినిమా బడ్జెట్ ఐదు వందల కోట్లు కూడా క్రాస్ చేయని తరుణంలో `మహాభారతం` సినిమాను వెయ్యి కోట్లతో నిర్మిస్తామని ప్రకటించగానే అందరూ షాకయ్యారు.