‘స్కై లాబ్’ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది : హీరో సత్యదేవ్
Send us your feedback to audioarticles@vaarta.com
వెర్సటైల్ యాక్టర్స్ సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించి చిత్రం ‘స్కైలాబ్’. నిత్యామీనన్ సహ నిర్మాత. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. డిసెంబర్ 4న మూవీ విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ ఇంటర్వ్యూ విశేషాలు...
సాధారణంగా నేను కాలేజీ డేస్ నుంచి చాలా సరదాగా ఉంటాను. కానీ నా ఫేస్ చూడటానికి కామెడీకి భిన్నంగా ఉండటంతో ప్రారంభంలో ఇన్‌టెన్స్ రోల్స్ చేస్తూ వచ్చాను. అలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు కానీ, స్నేహితులు కానీ.. ఏంట్రా నువ్వు ఇన్‌టెన్స్ రోల్స్ చేస్తున్నావు అనుకునేవాళ్లు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన క్యారెక్టర్ కూడా రాలేదని కూడా ఆగాను. ఇక స్కై లాబ్ విషయానికి వస్తే అందులో నా క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుంది. స్కై లాబ్ పడిపోతున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఓ డాక్టర్ డిమాండ్ సప్లయ్ అని మాట్లాడుతుంటాడు. డాక్టర్ ఆనంద్‌కు మంచి ఆర్క్ ఉంటుంది. స్కై లాబ్ పడిపోతున్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించాలనుకునే ఆనంద్ అనే డాక్టర్ చివరకు ఎలా మారిపోతాడనేది.. క్యారెక్టర్‌లో మంచి ఆర్క్ ఉంటుంది. సిట్యువేషనల్ కామెడీ. గ్రామస్థులతో కామెడి. ఆనంద్ బండ లింగపల్లిలో ఓ క్లినిక్ పెట్టాలనుకుంటాడు. ఆ గ్రామస్థులు అందుకు ఒప్పుకుంటారా? ఏం చెప్పి ఒప్పించారు? అనే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. గౌరి, డాక్టర్ ఆనంద్, సుబేదార్ రామారావు సహా అన్నీ పాత్రలను చక్కగా రాశారు. వీళ్లు వాళ్లు అని కాదు.. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
స్కై లాబ్ పడిపోతుందని, ఓ పర్టికులర్ గ్రామం నాశనమైపోతుందనే వార్త బయటకు రావడంతో.. అప్పట్లో అందరూ భయపడ్డారు. పర్టికులర్ ప్రాంతంలోని వారు చనిపోతామని భావించారు. కోళ్లు, మేకలు కోసుకుని తినేశారు. ఇంకేం ఉండదు అని భావించారు. నేను విన్న దాని ప్రకారం కొందరైతే బంగారు నాణెలను మింగేశారని, కొందరు ఆస్థులను అమ్ముకుని వెళ్లిపోయారని ఇలా చాలా చాలా జరిగాయి.
గౌరి, ఆనంద్, సుబేదార్ రామారావు అనే మూడు ప్రధాన పాత్రలు వీటితో పాటు స్కై లాబ్... బండ లింగపల్లిలోని ప్రజలు చుట్టూ కథ తిరుగుతుంది. అందరి మధ్య కామెడీగా సాగే సినిమా.
స్కై లాబ్‌కు ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రాఫర్. డీ శాట్ ప్యాట్రన్‌లో కాకుండా .. దర్శకుడు విశ్వక్ అండ్ టీమ్ దాన్నొక సెలబ్రేషన్స్‌లా చూపించాలని అనుకున్నారు. దాంతో సినిమా అంతా కలర్‌ఫుల్‌గా చూపించారు. కరీంనగర్ బండలింగపల్లి గ్రామంలో జరిగే కథ. కాబట్టి యాస విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం. నాకు తెలంగాణ యాస కొంతవచ్చు. కొంత నేర్చుకున్నాను.
సింక్ సౌండ్‌లో సినిమా చేయడం వల్ల డబ్బింగ్ చెప్పాల్సిన పనిలేదు. అయితే సింక్ సౌండ్‌లో సినిమా చేయడమనేది అంత సులభమైన విషయమైతే కాదు. డైలాగ్ నేర్చుకుని సీన్‌లో నటించగలిగితే అథెంటిక్‌గా ఉంటుంది. పెర్పామెన్స్ కూడా ఎన్‌హన్స్ అవుతుంది.
నాకు, నిత్యామీనన్‌కు ఆన్ స్క్రీన్ ఒక సీన్ కూడా ఉండదు. నిత్యా మీనన్‌గారు సూపర్బ్ పెర్ఫామర్. అన్ని పాత్రలకు ఓ కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది.
వివేక్ ఆత్రేయ నాకు ఫోన్ చేసి విశ్వక్ గురించి చెప్పి కథ వినమన్నాడు. తను రాగానే సూట్‌కేసుతో వచ్చాడు. అడ్వాన్స్ ఇస్తాడేమో అనుకున్నాను. కానీ అందులో సినిమాకు కావాల్సిన డేటా ఉంది. దాని సహాయంతో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్లాడు. తను అంత క్లారిటీతో ఉన్నాడు. నెరేషన్ నచ్చడంతో ముందుకెళ్లాం. కోవిడ్ టైమ్‌లో షూటింగ్స్ ఆగిపోయాయి. గ్యాప్‌లో మరో చిన్న సినిమా చేద్దామని అన్నా కూడా తను ఒప్పుకోలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు.
లుక్ విషయంలోనూ విశ్వక్ కేర్ తీసుకున్నాడు. అంతకుముందున్న సినిమాల్లో ఉన్న గడ్డం మీసాలు తీసేసి నటించాను.
నటుడిగా ఛాలెంజ్‌ను తీసుకోకపోతే సెట్స్‌కు రాలేనేమో అని నేను భావిస్తాను. అందుకనే స్కై లాబ్ సినిమా చేశాను. గుర్తుందా శీతాకాలం సినిమా చూస్తే అందులో మూడు వేరియేష్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. లవ్‌స్టోరి. ఇప్పటి వరకు నేను చేయని జోనర్ కాబట్టి చేశాను. అలా రొటీన్‌గా చేస్తే ఆడియెన్స్ తిడతారు..
గాడ్‌ఫాదర్‌లో నటిస్తున్నాను. కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వస్తే బావుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com