సునీల్ ప్లేస్‌లో స‌త్య‌దేవ్‌...

  • IndiaGlitz, [Friday,December 15 2017]

త‌మిళంలో సినిమాటోగ్రాఫ‌ర్ న‌ట‌రాజ్ హీరోగా చేసిన చిత్రం 'చ‌తురంగ వేట్టై'. వినోద్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీదేవి మూవీస్ రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

ముందు ఈ రీమేక్‌లో అడివిశేష్ న‌టిస్తాడ‌ని అనుకున్నారు కానీ.. ఆస్థానంలో సునీల్ వ‌చ్చి చేరాడు. తాజాగా సునీల్ కూడా ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడ‌ని స‌మాచారం.

సునీల్ ప్లేస్‌లో స‌త్య‌దేవ్ సినిమాలో మెయిన్ లీడ్‌లోక‌న‌ప‌డ‌బోతున్నాడు. జ్యోతిల‌క్ష్మిలో ఛార్మితో న‌టించిన స‌త్య‌దేవ్...ప‌లు చిత్రాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌లు చేశాడు. మ‌రి ఈ రీమేక్ స‌త్య‌దేవ్‌కు ఏ మేర క‌లిసొస్తుందో చూడాలి.