వంశీ నీ సినిమాలు నాకు నచ్చవ్ అంటున్న డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
వంశీ..నీ సినిమాలు నాకు నచ్చవ్ అంటున్న డైరెక్టర్... సతీష్ కాశెట్టి. ఇంతకీ సతీష్ కాశెట్టి ఎవరు అనుకుంటున్నారా..? హోప్, కలవరమాయే మదిలో, టెర్రర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు. వంశీ పైడిపల్లి సినిమాలు మున్నా, బృందావనం, ఎవడు..చిత్రాలు చూసి ఇక వంశీ సినిమాలు చూడకూడదు అని నిర్ణయించుకున్నాడట డైరెక్టర్ సతీష్ కాశెట్టి. అయితే... పనికిరాని కామెడీ ట్రాక్స్, అవసరం లేని ఫైట్స్..కావాలనుకునే ఈరోజుల్లో...ఎమోషన్ అంటే ఎందుకు అనుకునే ఏక్టర్స్ , ప్రొడ్యూసర్స్ ఉన్న ఈరోజుల్లో...ఊపిరి ఆడక చచ్చిపోతున్నతెలుగు సినిమాకి ప్రాణం పోసిన సినిమా ఊపిరి అంటూ సతీష్ కాశెట్టి స్టేట్ మెంట్ ఇచ్చేసారు.
ఈ సినిమాని నిర్మాత కొరకు, కార్తీ కోసం చూసాను. సినిమా చూసాకా ఆశ్చర్యపోయాను. సినిమాకి ఊపిరి కార్తీ అంటూ స్పందించాడు డైరెక్టర్ సతీష్ కాశెట్టి. అంతా బాగానే ఉంది కానీ...తెలుగు సినిమా నడక - నడతను మార్చిన నిజమైన ట్రెండ్ సెట్టర్ & సెల్యూలాయిట్ సైంటిస్ట్ నాగార్జున గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం...తమిళ హీరో కార్తీ కోసమే ఈ సినిమా చూసానని చెప్పడం మాత్రం ఏం బాగోలేదు సతీష్ గారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com