పవన్ పై సెటైర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న అన్నపూర్ణ సుంకర...మన డైరెక్టర్స్ కి సినిమాలు తీయడం రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి బాగా పాపులర్ అయిపోయింది. ఎంతగా పాపులర్ అయిందంటే...ఆమె వ్యాఖ్యలకు స్పందిస్తూ.. యంగ్ హీరోలు, యాంకర్స్ మరో వీడియో రిలీజ్ చేసేంత పాపులర్ అయ్యింది. ఇక కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే ఏకంగా అన్నపూర్ణ సుంకర చేసిన వ్యాఖ్యలపై చర్చా కార్యక్రమాలు కూడా పెట్టాయి. ఇక అసలు విషయానికి వస్తే...
నేడు పేరు చెప్పకుండా అడ్రస్ చెప్పిన చిత్తూరు వాసి పవన్ పై సెటైర్స్ ...అంటూ ఓ వీడియోను యుట్యూబ్ లో పెట్టాడు. అందులో మెగా హీరోల కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదంటున్నాడు. పవన్ గురించి ఏదో పోస్ట్ చేస్తే...తనని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటున్నాడు. ఇంతకీ అతను ఏం పోస్ట్ చేసాడో..ఎందుకు చంపుతామంటున్నారో క్లారిటీ లేదు.
ఒక్క మెగా ఫ్యాన్సే కాదు. బాలయ్య, నాగార్జున, వెంకటేష్..ఇలా ఎవరినీ వదలలేదు. అందరి హీరోల ఫ్యాన్స్ పై ఫైర్ అవుతున్నాడు. హీరోలును అభిమానించడం కాదు..స్వాతంత్ర్య సమరయోధులను అభిమానించాలి అంటున్నాడు. తను మాత్రం అవినీతి అంతం కోసం అందరికి సమానత్వం..కోసం పొరాడతానంటున్నాడు.ఇదంతా చూస్తుంటే...అన్నపూర్ణ సుంకర స్పూర్తితో పాపులర్ అవ్వడానికి చేసిన ప్రయత్నమే అనిపిస్తుంది.ఏమితో..అంతా యుట్యూబ్ మాయ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com