శ్రీదేవి చనిపోయింది అందుకేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
అటు బాలీవుడ్‌లో, ఇటు దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందిన ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి ప్రమాదవశాతు అకాల మరణం పొందారు. ఆమె మరణం వారి కుటుంబ సభ్యులకే కాదు.. సినీ ఇండస్ట్రీకి తీరని లోటే.
అయితే శ్రీదేవి మరణంపై కొన్ని అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. ఈ అనుమాలపై రచయిత సత్యార్థ నాయక్ తన పుసక్తంతో బదులిచ్చారు. శ్రీదేవి జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చిన సత్యార్థ నాయక్... శ్రీదేవి మరణానికి ఏదీ కారణంగా ఉండి ఉండవచ్చో చెప్పారు. అందుకోసం ఆయన శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు ఆమె సన్నిహితులను కలిసి వివరాలను సేకరించారు.
``చాల్బాజ్ దర్శకుడు పంకజ్, నాగార్జున నాతో మాట్లాడుతూ శ్రీదేవికి రక్తపోటు సమస్య ఉందని చెప్పారు. గతంలో ఆమె వారితో షూటింగ్ చేసే సమయాల్లో బాత్‌రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయారట. అలాగే శ్రీదేవి మేనకోడలు మహేశ్వరిని కలిసినప్పుడు ఆమె కూడా ఓసారి శ్రీదేవి బాత్‌రూమ్‌లో కళ్లు తిరిగి పడ్డారని, ఆమె ముఖానికి గాయమైందని, రక్తం వచ్చిందని చెప్పారు. వాకింగ్ సమయలోనూ శ్రీదేవి కుప్పకూలిపోయేదని ఆమె భర్త బోనీకపూర్ కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే శ్రీదేవిగారు లో బీపీ సమస్యతో ఇబ్బంది పడేవారు`` అని ఓ ఇంటర్వ్యూలో సత్యార్థ నాయక్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments