శ్రీదేవి చ‌నిపోయింది అందుకేనా?

  • IndiaGlitz, [Sunday,January 05 2020]

అటు బాలీవుడ్‌లో, ఇటు ద‌క్షిణాదిన అగ్ర‌తార‌గా వెలుగొందిన ఫిబ్ర‌వ‌రి 24, 2018న దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లోని బాత్‌ట‌బ్‌లో పడి ప్ర‌మాద‌వ‌శాతు అకాల మ‌ర‌ణం పొందారు. ఆమె మ‌ర‌ణం వారి కుటుంబ స‌భ్యుల‌కే కాదు.. సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటే.

అయితే శ్రీదేవి మ‌ర‌ణంపై కొన్ని అనుమానాలు అలాగే మిగిలిపోయాయి. ఈ అనుమాల‌పై ర‌చ‌యిత స‌త్యార్థ నాయ‌క్ త‌న పుస‌క్తంతో బ‌దులిచ్చారు. శ్రీదేవి జీవితాన్ని పుస్త‌క రూపంలో తీసుకొచ్చిన స‌త్యార్థ నాయ‌క్... శ్రీదేవి మ‌ర‌ణానికి ఏదీ కార‌ణంగా ఉండి ఉండ‌వ‌చ్చో చెప్పారు. అందుకోసం ఆయ‌న శ్రీదేవి కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆమె సన్నిహితుల‌ను క‌లిసి వివ‌రాల‌ను సేక‌రించారు.

''చాల్బాజ్ ద‌ర్శ‌కుడు పంక‌జ్‌, నాగార్జున నాతో మాట్లాడుతూ శ్రీదేవికి ర‌క్త‌పోటు స‌మ‌స్య ఉంద‌ని చెప్పారు. గ‌తంలో ఆమె వారితో షూటింగ్ చేసే స‌మ‌యాల్లో బాత్‌రూమ్‌లో క‌ళ్లు తిరిగి ప‌డిపోయార‌ట‌. అలాగే శ్రీదేవి మేన‌కోడ‌లు మ‌హేశ్వ‌రిని క‌లిసిన‌ప్పుడు ఆమె కూడా ఓసారి శ్రీదేవి బాత్‌రూమ్‌లో క‌ళ్లు తిరిగి ప‌డ్డార‌ని, ఆమె ముఖానికి గాయ‌మైంద‌ని, ర‌క్తం వ‌చ్చింద‌ని చెప్పారు. వాకింగ్ స‌మ‌య‌లోనూ శ్రీదేవి కుప్ప‌కూలిపోయేద‌ని ఆమె భ‌ర్త బోనీక‌పూర్ కూడా చెప్పారు. దీన్ని బ‌ట్టి చూస్తే శ్రీదేవిగారు లో బీపీ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డేవారు'' అని ఓ ఇంట‌ర్వ్యూలో స‌త్యార్థ నాయ‌క్ తెలిపారు.

More News

పేరు మార్పు క‌లిసొస్తుందా నాయ‌నా!

సినిమా రంగంలో ఎంత మంది ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నేది ఎంత ముఖ్య‌మో చిన్న మ్యాజిక్ కోసం వెయిట్ చేయ‌డం అనేది కూడా కామ‌నే!. దాన్నే సెంటిమెంట్ అంటుంటారు. సినిమా రంగంలో ఇలాంటి సెంటిమెంట్

నా జీవితం గ‌తం కంటే ఎంతో బావుందంటున్న స్టార్

కొంద‌రు స్టార్స్ మాట్లాడుతుంటే ఎలాంటి దాప‌రికం ఉండ‌దు. నేరుగా మాట్లాడేస్తారు. కానీ మ‌రికొంద‌రు మాత్రం చాలా దాప‌రికంగా మాట్లాడుతుంటారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ రెండు కేటగిరీకి చెందిన వాడు. రీసెంట్‌గా

త్వరలో మహేశ్-మురగ కాంబోలో సినిమా!!

సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన ‘దర్బార్‌’. ఈ చిత్రం జనవరి-09న విడుదల కానుంది.

‘సరిలేరు..’, ‘అల..’ రిలీజ్‌ డేట్స్‌‌పై క్లారిటీ వచ్చేసింది

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో..’

13 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తోన్న లేడీ అమితాబ్‌ విజయశాంతి!!

'నేటి భారతం', 'ప్రతిఘటన', 'కర్తవ్యం', 'ఒసేయ్‌ రాములమ్మ' వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ ఉత్తమ నటి,