రజనీ, కమల్‌పై సత్యరాజ్ ఫైర్
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
సత్యరాజ్.. ఒకప్పుడు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాహుబలి, మిర్చి సహా పలు తెలుగు చిత్రాల తర్వాత తెలుగు ప్రేక్షకుకు సుపరిచితుడిగా మారారు. బేసిక్‌గా తమిళ నటుడైన సత్యరాజ్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్‌హాసన్‌లపై విమర్శలు చేశాడు.
కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం అనే పార్టీని స్థాపించగా.. రజనీకాంత్ త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించనున్నాడు. ఈ నేపథ్యంలో సత్యరాజ్.. రాజకీయ శూన్యత ఏర్పడిందని చెప్పడం అవివేకం. అలాంటి శూన్యత రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో మరి ఎందుకు కనిపించలేదు?. కొత్తగా పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వస్తామనే నటుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది. నాన్ లోకల్ వ్యక్తుల రాజకీయ సేవలు(రజనీకాంత్‌ను ఉద్దేశించి) అవసరం లేదని అనుకుంటానంటూ సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.