చివరి షెడ్యూల్ లో 'సత్య గ్యాంగ్'

  • IndiaGlitz, [Saturday,February 03 2018]

సాత్విక ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేష్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ' సత్య గ్యాంగ్'. పుష్కలమైన వినోదానికి కాస్తంత సందేశాన్ని జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. హీరో సాత్విక ఈశ్వర్, సీనియర్ ఆర్టిస్ట్స్ సుమన్, సుహాసినిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతోపాటు.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తూ.. దర్శకత్వ పర్వ్యవేక్షణ చేస్తున్న మహేష్ ఖన్నా మాట్లాడుతూ.. 'సమాజంలో అనాధలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి తీస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్'. హీరోగా పరిచయమవుతున్న సాత్విక ఈశ్వర్ కి చాలా మంచి భవిష్యత్ ఉంది. ఇంకో వారం రోజులు జరిగే షూటింగ్ తో పాటలు సహా సినిమా పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పారలెల్ గా జరుగుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

సాత్విక్ ఈశ్వర్ సరసన అక్షిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యూష్, హర్షిత, సుమన్, సుహాసిని, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా, రాజేందర్, దిల్ రమేష్, బి.హెచ్.ఈ. ఎల్.ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కథ: సిద్ధయోగి క్రియేషన్స్, ఎడిటర్: నందమూరి హరి, అసోసియేట్ డైరెక్టర్: నాగబాబు, కో-డైరెక్టర్స్; కొండలరావు-వి.ఎన్. రెడ్డి, నిర్మాత-దర్శకత్వపర్యవేక్షణ: మహేష్ ఖన్నా, సంగీతం-దర్శకత్వం: ప్రభాస్!!

More News

ఫస్ట్ కాపీతో ఈ నెలలోనే విడుదలకు సిద్ధమైన గుడ్ బ్యాడ్ అగ్లీ

గుడ్ అంటే మంచి,బ్యాడ్ అంటే చెడు,అగ్లీ అంటే తింగరితనం ఈ పదాలు మనకు తెలిసినవే.

కోటి హృదయాలను మీటిన పాట...నీకు నాకు మధ్య ఏదో ఉంది...

నిత్యం ఎన్నో రాగాలు, మరెన్నో పాటలు మనం వింటూనే ఉంటాం.

దృష్టి థియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

అందాల రాక్షసి,అలా ఎలా సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా,

కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా 'గున్న' లోగో ఆవిష్కరణ

సాలగ్రామ్ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం'గున్న'.

కళాశాల నేపథ్యంలో చిరు అల్లుడి సినిమా

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే.