'తిమ్మరుసు' ట్రైలర్: 'నువ్వు వాలివైతే నేను దండేసి దండించే రాముడ్ని'
Send us your feedback to audioarticles@vaarta.com
యువ నటుడు సత్యదేవ్ విభిన్నమైన పాత్రలు, అద్భుత అవకాశాలతో దూసుకుపోతున్నాడు. సత్యదేవ్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఘాజి, అంతరిక్షం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలతో సత్యదేవ్ గుర్తింపు పొందాడు. తాజాగా సత్యదేవ్ లీడ్ రోల్ లో, ప్రియాంక జవాల్కర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న చిత్రం తిమ్మరుసు.
శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 30న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడం విశేషం. సత్యదేవ్ లాయర్ పాత్రలో నటిస్తున్న తిమ్మరుసు ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది.
8 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ కేసులో కూపీ లాగే డిఫెన్స్ లాయర్ రామచంద్ర పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. అతడి ప్రేయసిగా ప్రియాంక జవాల్కర్ కనిపిస్తోంది. ఇక నటుడు అజయ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. అజయ్, సత్యదేవ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకం కానున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.
మర్డర్ కేసు టేకప్ చేసిన సత్యదేవ్ కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. వాటిని సత్యదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కథగా ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. 'నువ్వు కొడితే సౌండ్ మాత్రమే వస్తుంది.. ఈ లాయర్ కొడితే జీవితం మొత్తం రీసౌండే', నువ్వు సగం బలం లాక్కునే వాలివైతే.. నేను దండేసి దండించే రాముడ్ని' లాంటి డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది అనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments