గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న 'సతీ తిమ్మమాంబ'

  • IndiaGlitz, [Sunday,November 08 2015]

ఎస్‌.ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న హిస్టారికల్‌ మూవీ 'సతీ తిమ్మమాంబ' భారీ గ్రాఫిక్స్‌తో ఈనెలాఖరుకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ..'అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సుమారు 600 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు చేసుకుంది. ఈ మాను యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలనే గొప్ప సంకల్పంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇటీవల నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేసిన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ గ్రాఫిక్స్‌తో ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఈ నెలాఖరుకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము...' అని తెలిపారు.
భవ్యశ్రీ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రభాకర్‌, రంగనాధ్‌, చంద్రమోహన్‌, రాజశ్రీ, జూనియర్‌ రేలంగి మొదలగు వారు ఇతర తారాగణం.

ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, కెమెరా: షాహిద్‌ హుస్సేన్‌, పాటలు: బండారు దానయ్య కవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్‌: వినయ్‌, దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్‌. రామ్‌కుమార్‌, నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.