శాటిలైట్ అంటే సోలర్జ్...
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా కొత్త కాన్సెప్ట్ సినిమాలకు ఆదరణ లభిస్తున్న తరుణంలో దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ మంచి విజయాన్ని దక్కించుకుంది. సబ్‌మెరైన్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రంగా ఘాజీ పేరును సంపాదించుకుంది.
ఇప్పుడు సంకల్ప్ అంతరిక్షం నేపథ్యంలో మరో సినిమాను తెరకెక్కించాడు. సినిమాకు కూడా `అంతరిక్షం` అనే టైటిల్‌నే పెట్టారు. అయితే ఇప్పటికే తమిళంలో టిక్ టిక్ టిక్ అనే పేరుతో స్పేస్ మూవీ విడుదలైంది. మరి అంతరిక్షంలో కొత్తగా ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు. లావణ్య పాత్ర హౌస్ వైఫ్ అనిపిస్తుంది. అదితిరావు మాత్రం ఆస్ట్రానాయిడ్‌గా కనపడుతున్నారు.
`హీ ఈజ్ లూజింగ్ కంట్రోల్..పేనిక్ అవకు.. ఫోకస్ ఫోకస్` అంటూ హీరోయిన్ వాయిస్.. `10 సెకన్లు మాత్రమే ఉంది` అంటూ వార్నింగ్ వాయిస్ మీరా అనే ఉపగ్రహంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉండటంతో దాన్ని సరిచేయడానికి దేవ్(వరుణ్ తేజ్) నేతృత్వంలో ఓ టీమ్ అంతరిక్షంకు వెళుతుంది. అక్కడ వీళ్లు ప్రయాణించే ఉపగ్రహం కక్ష్య తప్పుతుంది. అక్కడేం జరిగిందనేదే సినిమా కథ అని తెలుస్తుంది.
ఒకప్పుడు నీకు ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఉండేది. దాన్ని పొగొట్టుకోకు అని శ్రీనివాస్ అవసరాల అంటే.. ప్రయత్నించకుండా ఓడిపోవడం కంటే అవమానం మరొకటి ఉండదు మోహన్ అని హీరో వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్‌తో పాటు ఈ శాటిలైట్ ఒక సోల్జర్‌లాంటిది. ఫెయిల్ అయితే ఎలా అని అడగకూడదు. గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి.. అనే సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ట్రైలర్ వరకు చూస్తే ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలక పాత్రను పోషించినట్టు కనపడుతున్నాయి. డిసెంబర్ 21న విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout