Sasivadane:హృదయాన్ని హత్తుకుంటున్న 'శశివధనే' టీజర్..
Send us your feedback to audioarticles@vaarta.com
గోదావరి నేపథ్యంలో వచ్చే సినిమాలు ఓ కొత్త అనుభూతిని మిగిలిస్తూనే ఉంటాయి. నది చుట్టూ ప్రాంతాలు, కొబ్బరి చెట్లు, పచ్చటి వాతావరణం చుట్టూ సాగే కథలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. తాజాగా అలాంటి రీఫ్రెషింగ్ కథతోనే 'శశివధనే' సినిమా రాబోతుంది. 'పలాస 1978’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రక్షిత్ అట్లూరి ఈ సినిమాలో హీరోగా నటించగా.. తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోసర్లు, ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ పాటలకు విశేష స్పందన వచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా అందమైన ప్రేమకథను ఈ చిత్రంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇక టీజర్ ఎండింగ్లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది.‘గడిచే కాలంతో నేలపై నడిచే నా ప్రతి అడుగు ఇక పై నీతోనే’, ‘ఇన్ని రోజులు విడి పరుగు నా వెంట పడడమే అనుకున్నాను. కానీ వీడు వేరే’.. అనే డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అనుదీప్ దేవ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది.
గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఇక ఈ సినిమాలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం: సమర్పణ - గౌరీ నాయుడు, బ్యానర్స్ - ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు - అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం - సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ - శ్రీసాయి కుమార్ దారా, సంగీతం - శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ - అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ - జేడీ, సి.ఇ.ఒ - ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ - సురేంద్ర నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments