Sasivadane:హృదయాన్ని హత్తుకుంటున్న 'శశివధనే' టీజర్..

  • IndiaGlitz, [Thursday,January 04 2024]

గోదావరి నేపథ్యంలో వచ్చే సినిమాలు ఓ కొత్త అనుభూతిని మిగిలిస్తూనే ఉంటాయి. నది చుట్టూ ప్రాంతాలు, కొబ్బరి చెట్లు, పచ్చటి వాతావరణం చుట్టూ సాగే కథలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. తాజాగా అలాంటి రీఫ్రెషింగ్ కథతోనే 'శశివధనే' సినిమా రాబోతుంది. 'పలాస 1978’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రక్షిత్ అట్లూరి ఈ సినిమాలో హీరోగా నటించగా.. తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోసర్లు, ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ పాటలకు విశేష స్పందన వచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా అందమైన ప్రేమకథను ఈ చిత్రంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇక టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది.‘గడిచే కాలంతో నేలపై నడిచే నా ప్రతి అడుగు ఇక పై నీతోనే’, ‘ఇన్ని రోజులు విడి పరుగు నా వెంట పడడమే అనుకున్నాను. కానీ వీడు వేరే’.. అనే డైలాగ్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అనుదీప్ దేవ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది.

గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హిస్తున్నారు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఇక ఈ సినిమాలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం: సమర్పణ - గౌరీ నాయుడు, బ్యానర్స్ - ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్, నిర్మాతలు - అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల, రచన-దర్శకత్వం - సాయి మోహన్ ఉబ్బర, సినిమాటోగ్రాఫర్ - శ్రీసాయి కుమార్ దారా, సంగీతం - శరవణ వాసుదేవన్, బ్యాగ్రౌండ్ స్కోర్ - అనుదీప్ దేవ్, ఎడిటర్- గ్యారీ బి.హెచ్, కొరియోగ్రాఫర్ - జేడీ, సి.ఇ.ఒ - ఆశిష్ పేరి, పి.ఆర్.ఒ - సురేంద్ర నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

More News

YS Sharmila-Jagan: మూడేళ్ల తర్వాత అన్న జగన్‌ను కలిసిన చెల్లెమ్మ షర్మిల

ఏపీ సీఎం, సోదరుడు జగన్‌ మోహన్ రెడ్డి(CM Jagan)ని వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల.. అన్న జగన్, వదిన భారతికి శుభలేఖ ఇచ్చి

Janasena: జనసేన పార్టీలో చేరిన కాంగ్రెస్, వైసీపీ నాయకులు

2024లో రాష్ట్రంలో పెద్ద మార్పును తీసుకురాబోతున్నామని.. ప్రభుత్వంలో బలమైన భాగస్వామ్యం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు.

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?

సంక్రాంతి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఆరు రోజుల పాటు పండుగ సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 12 నుంచి 17వ తేది వరకు హాలీడేస్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Officers Transfer: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ.. స్మితా సభర్వాల్‌కు కొత్త పోస్ట్..

తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. ఏకంగా 26 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

MLC Ramachandraiah: వైసీపీకి వరుస షాకులు.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.