ఆస్పత్రి, ప్రేమ వ్యవహారాలు ‘శశి లలిత’లో చూపిస్తాం!
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ రాజకీయాలను ఒంటి చేత్తో శాసించి.. ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దివంగత నేత జయలలిత జీవిత చరిత్ర.. ఆమె నెచ్చలి శశికళపై ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి జయలలిత బయోపిక్‌ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి ‘శశిలలిత’ అని పేరుపెట్టిన కేతిరెడ్డి.. ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టి సినిమాకు సంబంధించి పలు ఆసక్తిర విషయాలు వెల్లడించారు.
శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారం కూడా..!
"‘శశి లలిత’ చిత్ర నిర్మాణంకు సర్వం సిద్ధం. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో ‘శశి లలిత’ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమా ద్వారా ఆమెకు జరిగిన అన్యాయం చూపించ బోతున్నాం. సినిమాలో యదార్థ సంఘటనలు తెరకెక్కించనున్నాం. 78 రోజులపాటు ఆస్పత్రిలో అసలేం జరిగింది..?. జయలలిత పాత్రలో కాజల్ దేవగన్, శశికళ పాత్రలో అమల పాల్ నటించబోతున్నారు. జయలలిత బాల్యం.. నుంచి చిత్ర పరిశ్రమకు రావడం.. శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారం. ఇలా అన్ని అంశాలూ కవర్ చేశాం.
రెండన్నర గంటల్లో జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్ని వివరించబోతున్నాం. 'లక్ష్మీస్ వీరగ్రంధం’' 'శశిరేఖ'.. ఎలెక్షన్ కోడ్ వలన ఆసల్యమైంది. కోడ్ తొలగిన వెంటనే సినిమా రిలీజ్ చేస్తాం. జూన్ ముగింపులో ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వచ్చే ఏడాదిలో శశి లలిత రీలీజ్ చేయబోతున్నాం" అని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.
సో.. మొత్తానికి చూస్తే కేతిరెడ్డి 'శశి లలిత' చిత్రంతో డేంజర్ ఫీట్ వేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారం అనేది వివాదాలకు దారి తీయకుండా ఎలా మేనేజ్ చేస్తారో వేచి చూడాల్సిందే మరి. అయితే ఈయన తీస్తానన్న.. తీసిన సినిమాలు చాలా వరకు రిలీజ్ వరకు వచ్చిన దాఖలాలు చాలా తక్కువే.. మరి ఈ సినిమా అయినా రిలీజ్ అవుతుందా లేకుంటే నాలుగు రోజులు హడావుడి చేసి కేతిరెడ్డి మిన్నకుండిపోతారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments