హారర్ ఎంటర్ టైనర్ 'శశికళ' ట్రైలర్ విడుదల
Monday, March 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్ ను తెలుగులో "శశికళ" పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినుభారతి దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఎమ్. ఎల్. సి. సుధాకర్ బాబు విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, దర్సకనిర్మాతలు రాజ్ కందుకూరి, సాయి వెంకట్, ప్రముఖ నటులు లోహిత్, రామ్ రావిపల్లి, గీత రచయిత సిరాశ్రీలతో పాటు ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తున్నఅగర్వాల్-సంజీవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ వై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్. ఎల్. సి. సుధాకర్ బాబు "శశికళ" ప్రచార చిత్రాల్ని ఆవిష్కరించి.. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. సింగల్ స్క్రీన్స్ లో 5 వ ఆటకు తెలంగాణా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ విధానం అమలులోకి వచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సుధాకర్ బాబు హామీ ఇచ్చారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ గొలుపుతూ.. భయపెడుతూనే వినోదం అందించే హారర్ ఎంటర్ టైనర్ "శశికళ". ప్రఖ్యాత దర్శకుడు భారతిరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి భారతిరాజా శిష్యుడు విను భారతి దర్శకత్వం వహించారు. హారర్ చిత్రాలను ఆదరించేవారందరికీ "శశికళ" అమితంగా నచ్చుతుంది. ఏప్రిల్ రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. మిగతా వక్తలంతా రామ సత్యనారాయణ కార్యదక్షతను కొనియాడి.. "శశికళ" సంచలన విజయం సాధించాలని అభిలషించారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్, సంగీతం: నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: డా. శివ వై. ప్రసాద్-బి. సత్యనారాయణ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: విను భారతి!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments