టాప్ 5 గ్రాసర్ గా సరైనోడు చిత్రాన్ని నిలబెట్టిన ఫ్యామిలి ఆడియన్స్ మా ప్రత్యేఖ దన్యవాదాలు : చిత్ర యూనిట్ సభ్యులు
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , ప్రతిష్టాత్మక నిర్మాణసంస్థ గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో ఎస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన సరైనోడు చిత్రానికి యూత్, మాస్ ఆడియన్స్ తో పాటు ప్రత్యేఖంగా ఫ్యామలి ఆడియన్స్ అందరూ అత్యద్బుతమైన రెస్పాన్స్ తో కలెక్షన్ల రికార్డులతో బాక్సాఫీస్ వద్ద సెటిల్ చేశారు. ఈ సమ్మర్ లో 2106 లొనే టాప్ గ్రాసర్ గా, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక రికార్డు కలెక్షన్స్ ను వసూలు చేస్తూ... ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా ఇటీవలే విజయవాడలో బాక్సాఫీస్ ఫంక్షన్ పేరిట వేలాది మంది అభిమానుల సమక్షంలొ కలర్ ఫుల్ గా అంగరంగ వైభవంగా జరిపిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సరైనోడు చిత్రం కలెక్షన్ల రికార్డుల్లో సరికొత్త మైలురాళ్ళని అందుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న తెలుగు చిత్రాల్లో సరైనోడు చిత్రానికి ఓ ప్రత్యేఖ స్ధానం చేకూరింది. తెలుగు చిత్రాలు మంచి కంటెంట్ విత్ ప్రోపర్ ప్రమెషన్ తో వచ్చిన చిత్రాల్నితెలుగు ప్రేక్షకుల ఏ స్థానం లో కూర్చోబెడతారో సరైనోడు చిత్రం తో మరోక్కసారి నిరూపించారు. రెండు వారాలుగా రికార్డు కలెక్షన్ల తో దూసుకువెలుతూ మూడవ వారంలో అదే ఊపుతో కలెక్షన్ల సునామి కంటిన్యూ చేస్తుంది అంటే దానికి ముఖ్య కారణం ఫ్యామిలి ఆడియన్స్ సపోర్ట్ అనే చెప్పాలి.
అందుకే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, లెజెండ్ దర్శకుడు బోయపాటి శ్రీను, అన్నపూర్ణ గార్లతో , దివ్య దర్శిని, హీరోయిన్స్ రకూల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు మరియ సరైన ఫ్యామిలి ఆడియన్స్ తో ప్రమోషనల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇప్పటికే చాలా ఎరియాల్లో టాప్ సెకండ్, థర్డ్ ప్లేస్ లలో వున్న సరైనోడు చిత్రం రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియోట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments