టాప్ 5 గ్రాస‌ర్ గా స‌రైనోడు చిత్రాన్ని నిల‌బెట్టిన ఫ్యామిలి ఆడియ‌న్స్ మా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు : చిత్ర యూనిట్ స‌భ్యులు

  • IndiaGlitz, [Tuesday,May 10 2016]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను , ప్రతిష్టాత్మక నిర్మాణ‌సంస్థ‌ గీతా ఆర్ట్స్ కాంబినేష‌న్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్‌ అల్లు అరవింద్ నిర్మాణంలో వ‌చ్చిన స‌రైనోడు చిత్రానికి యూత్‌, మాస్ ఆడియ‌న్స్ తో పాటు ప్ర‌త్యేఖంగా ఫ్యామలి ఆడియ‌న్స్ అంద‌రూ అత్య‌ద్బుత‌మైన రెస్పాన్స్ తో క‌లెక్ష‌న్ల‌ రికార్డుల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సెటిల్ చేశారు. ఈ స‌మ్మ‌ర్ లో 2106 లొనే టాప్ గ్రాస‌ర్ గా, స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక రికార్డు కలెక్షన్స్ ను వసూలు చేస్తూ... ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన‌ స్పందన రావడంతో సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా ఇటీవ‌లే విజయవాడలో బాక్సాఫీస్ ఫంక్ష‌న్ పేరిట వేలాది మంది అభిమానుల స‌మ‌క్షంలొ కలర్ ఫుల్ గా అంగ‌రంగ వైభవంగా జ‌రిపిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు స‌రైనోడు చిత్రం క‌లెక్ష‌న్ల‌ రికార్డుల్లో స‌రికొత్త మైలురాళ్ళ‌ని అందుకుంటుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న తెలుగు చిత్రాల్లో స‌రైనోడు చిత్రానికి ఓ ప్ర‌త్యేఖ స్ధానం చేకూరింది. తెలుగు చిత్రాలు మంచి కంటెంట్ విత్ ప్రోప‌ర్‌ ప్ర‌మెష‌న్ తో వ‌చ్చిన చిత్రాల్నితెలుగు ప్రేక్ష‌కుల‌ ఏ స్థానం లో కూర్చోబెడ‌తారో స‌రైనోడు చిత్రం తో మ‌రోక్క‌సారి నిరూపించారు. రెండు వారాలుగా రికార్డు క‌లెక్ష‌న్ల తో దూసుకువెలుతూ మూడ‌వ వారంలో అదే ఊపుతో క‌లెక్ష‌న్ల సునామి కంటిన్యూ చేస్తుంది అంటే దానికి ముఖ్య కార‌ణం ఫ్యామిలి ఆడియ‌న్స్ స‌పోర్ట్ అనే చెప్పాలి.

అందుకే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, లెజెండ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, అన్న‌పూర్ణ గార్ల‌తో , దివ్య ద‌ర్శిని, హీరోయిన్స్ ర‌కూల్ ప్రీత్ సింగ్‌, కేథ‌రిన్ లు మ‌రియ స‌రైన ఫ్యామిలి ఆడియ‌న్స్ తో ప్ర‌మోష‌న‌ల్ ప్రోగ్రాం నిర్వ‌హించారు. ఇప్ప‌టికే చాలా ఎరియాల్లో టాప్ సెకండ్‌, థ‌ర్డ్ ప్లేస్ ల‌లో వున్న స‌రైనోడు చిత్రం రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియోట్ చేస్తుందో చూడాలి.

More News

త్రిష ఇక వాటికే ప‌రిమిత‌మా?

'వ‌ర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అత‌డు', 'ఆకాశ‌మంత‌'.. ఇలా కొన్ని చిత్రాల్లో ది బెస్ట్ అన‌ద‌గ్గ యాక్టింగ్ స్కిల్స్‌ని ప్ర‌ద‌ర్శించింది త్రిష‌. ఆ త‌రువాత ఆమెకి ఆ రేంజ్ పాత్ర‌లైతే దొర‌క‌లేద‌నే చెప్పాలి.

'రైట్ రైట్' మేకింగ్ వీడియో విడుద‌ల‌

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస ఘ‌న విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎం.ఎస్‌.రాజు చేతుల మీదుగా క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన `రైట్ రైట్‌` మేకింగ్ వీడియో విడుద‌లైంది.

నిత్యా మరోసారి నిరూపించింది

'అలా మొదలైంది' నుంచి కథానాయిక నిత్యా మీనన్ ది ఒకటే శైలి. తనకిచ్చిన పాత్రకి న్యాయం చేయడం. అదే సిద్ధాంతాన్ని ఇటీవల విడుదలైన'24' వరకు కొనసాగిస్తూనే వచ్చింది. ఆ చిత్రంలో సూర్య పక్కన నటించినా ఒక్క పాట కూడా ఆమెకు లేదు.

చిరు, బాలయ్య తో పోటీపడనున్న లేడీ అమితాబ్?

ఒకప్పుడు అటు చిరంజీవికి, ఇటు బాలకృష్ణకి హిట్ పెయిర్ గా రాణించిన ఘనతని సొంతం చేసుకుంది లేడీ అమితాబ్ విజయశాంతి. ఇప్పుడు అదే చిరు, బాలయ్యతో ఆమె పోటీపడనుందా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ లో.

కుమారి ప్లేస్ లో రెజీనా...

కుమారి 21 ఎఫ్ చిత్రంతో కుర్రకారుకి దగ్గరైన కుర్రది హేబా పటేల్. ప్రస్తుతం నేను..నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో నటిస్తుంది. అలాగే రీసెంట్ గా స్టార్టయిన శ్రీనువైట్ల, వరుణ్ తేజ్ సినిమా మిస్టర్ లో ఒక హీరోయిన్ గా ఓకే అయ్యింది.