స్టైలీష్ స్టార్ కెరీర్లో సరైనహిట్..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సెన్సేషనల్ మూవీ సరైనోడు. ఈ చిత్రానికి ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ...ఆ ప్రభావం కలెక్షన్స్ పై ఏమాత్రం పడలేదు. రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూ...సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాడు సరైనోడు. స్టైలీష్ స్టార్ కెరీర్ లో రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి...ఈ మూడు చిత్రాలు 50 కోట్లకు పైగా వసూలు చేయగా..ఇప్పుడు సరైనోడు నాలుగో చిత్రంగా చేరబోతుంది.
ఈ సందర్భంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందిస్తూ...సరైనోడు సినిమాని నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చేసిన అందరికీ ముఖ్యంగా ఫ్యాన్స్ కి థ్యాంక్స్ అంటూ సక్సెస్ సంతోషాన్నిషేర్ చేసుకున్నాడు. గతంలో కూడా బన్ని చిత్రాలకు ముందు డివైడ్ టాక్ రావడం...ఆతర్వాత ఆ చిత్రాలు రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసి సక్సెస్ ఫుల్ మూవీస్ గా నిలవడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com