'సరైనోడు' తో మళ్లీ అలాగే..

  • IndiaGlitz, [Wednesday,March 30 2016]

మాస్ మెచ్చే సినిమాల‌ను తీయ‌డంలో బోయ‌పాటి శ్రీ‌ను స్టైలే వేరు. తొలి చిత్రం 'భ‌ద్ర' నుంచి గ‌త చిత్రం 'లెజెండ్' వ‌ర‌కు ఆయ‌న మాస్ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. రాబోయే కొత్త చిత్రం 'స‌రైనోడు'లోనూ త‌న శైలిని అలాగే కొన‌సాగిస్తున్నారాయ‌న‌. అయితే మాస్ ముద్ర‌నే కాకుండా.. మ‌రో విష‌యంలోనూ ఆయ‌న మార్క్ ఉంటుంది

అదేమిటంటే.. త‌న సినిమాల్లో కేర‌ళ కి చెందిన క‌థానాయిక‌లే వీలైనంత వ‌ర‌కు అవ‌కాశాలివ్వ‌డం. 'లెజెండ్' సినిమా మిన‌హాయిస్తే.. ఈ అంశం ప్ర‌తి సినిమాలోనూ చోటు చేసుకుంది. భ‌ద్ర‌లో న‌టించిన మీరా జాస్మిన్ మొద‌లుకొని.. తుల‌సి, సింహా (న‌య‌న‌తార‌), ద‌మ్ము (కార్తీక‌) వ‌ర‌కు ఇది కొన‌సాగించారు. మ‌ళ్లీ ఇప్పుడు 'స‌రైనోడు'లో ఈ అంశానికి మ‌రోసారి చోటిస్తూ.. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కేథ‌రిన్ ట్రెసా కి ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌లో ఒక‌రిగా చోటిచ్చారు. ఏదేమైనా.. కేర‌ళ కుట్టిల‌ను ప్రోత్స‌హించ‌డంలో ముందుండే ద‌ర్శ‌కుల‌లో బోయ‌పాటి స్థానం ప్ర‌త్యేకం.

More News

ఎంట‌ర్ టైన్మెంట్ - ఫ్యామిలీ ఎమోష‌న్స్ ప్ర‌త్యేకార్ష‌ణ‌గా అంద‌ర్నీ ఆక‌ట్టుకునే చిత్రం సావిత్రి - డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని

నారా రోహిత్ - నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం సావిత్రి. ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. విజ‌న్ ఫిల్మ్ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏప్రిల్ 1న సావిత్రి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా సావిత్రి ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేనితో ఇంట‌ర్ వ్యూ మీకోసం..

పవన్ కళ్యాణ్ కిది ఆరోసారి

నాలుగేళ్ల క్రితం 'గబ్బర్ సింగ్ ' గా వేసవికి సందడి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..మళ్లీ ఈ వేసవికి 'సర్దార్ గబ్బర్ సింగ్'

నితిన్, సమంత ల 'అ ఆ' ప్రచార చిత్రాలు విడుదల

నితిన్, సమంత ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం  అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు.  ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను కధానాయకుడు నితిన్ పుట్టినరోజు  సందర్భంగా ఈరోజు విడుదలచేశారు.

విజయ్ 'తెరి' తెలుగు టైటిల్

తమిళ చలన చిత్ర పరిశ్రమ లో నే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది సూపర్ స్టార్ విజయ్ నటించిన తమిళ చిత్రం ‘తెరి’ని తెలుగులో పోలీసోడు పేరుతో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, కలైపులి థాను విడుదల చేస్తున్నారు.

నిస్సహాయుల జీవితంలో ఆశాజ్యోతి లక్ష్మితో మేము సైతం

మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి,వారి కలల్ని నిజం చేయడానికి వస్తున్న ఆశాజ్యోతి మేము సైతం.