సరైనోడు టీజర్ కి భారీ ప్లాన్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నయాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. సరైనోడు ఫస్ట్ టీజర్ ను ఈనెల 18న రిలీజ్ చేస్తున్నారు. అయితే సరైనోడు టీజర్ ను ఆంథ్ర, తెలంగాణ, బెంగుళూరు లో కలపి మొత్తం 1000 స్ర్కీన్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.
ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ చేసేవారు. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను మరింత పెంచేలా 30 సెకన్ల టీజర్ ను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 18న టీజర్ రిలీజ్ అవుతుంది అయితే థియేటర్స్ లో మాత్రం ఈనెల 19 న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో బన్ని సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న సరైనోడు సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com