నేను ఏ లక్ష్యం తో సరైనోడు సినిమా చేసానో అది నెరవేరింది. - అల్లు అర్జున్
Monday, April 25, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన స్టైలీష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. ఇటీవల రిలీజైన సరైనోడు సినిమాకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ... బాక్సాఫీస్ వద్ద సరైనోడు మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. ఈ సందర్భంగా సరైనోడు సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ఆవాస హాటల్లో నిర్వహించారు. ఈరోజు డైరెక్టర్ బోయపాటి శ్రీను బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయించి ఆయనకు బర్త్ డే విషెష్ తెలియచేసారు సరైనోడు టీమ్.
ఈ సక్సెస్ మీట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ మాట్లాడుతూ...గంగోత్రి సినిమా తర్వాత బన్ని హీరోగా పనికిరాడు అంటూ ఇండస్ట్రీలో చాలా మంది కామెంట్ చేసారు. కానీ...బన్ని కామెంట్స్ ను లెక్క చేయకుండా పనినే ప్రాణంగా భావించి..సక్సెస్ సాధించి... ప్రేక్షకుల గుండెల్లో బుల్లెటులా దూసుకు వెళ్లాడు. ఈ సినిమాని ఆడియోన్స్ ఫ్యామిలీతో చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. భద్ర సినిమా నుంచి బోయపాటి గారితో వర్క్ చేస్తున్నాం. ఈ సినిమాలో బన్నిని ఎలా చూపిస్తారో అనుకున్నాం.కానీ.. లవ్, కామెడి, యాక్షన్...ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా చాలా చక్కగా రూపొందించారు అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ...ఎక్కడికి వెళ్లినా ఎవర్ని కలసినా సరైనోడు చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు. మూడు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట ఇది. నాకు పోలీస్ స్టోరీతో యాక్షన్ ఇమేజ్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఇలాంటి సినిమా ఎందుకు చేయలేదని అసూయ కలిగింది. ఆది చాలా బాగా నటించాడు. బోయపాటి సినిమాలు చూసినప్పటి నుంచి ఆయన సినిమాలో నటించాలనుకున్నాను. ఆయన డైరెక్షన్ లో ఓ మంచి సినిమాలో నటించినందుకు హ్యాఫీగా ఉంది. సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరైనోడు అన్నారు.
హీరోయిన్ కేథరిన్ మాట్లాడుతూ... బోయపాటి గారు కథ చెబుతూ ఎమ్మెల్యే క్యారెక్టర్ అని చెప్పగానే సర్ ఫ్రైజ్ గా అనిపించింది. క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత బాగా నచ్చింది. ఈ సినిమాలో నేను బాగా నటించానంటే ఆ క్రెడిట్ బోయపాటికే గారికే దక్కుతుంది. ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో బెస్ట్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అంటే ఇదే. బన్నితో కలసి మూడు చిత్రాల్లో నటించాను. అల్లు అరవింద్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని మంచి క్వాలిటీతో నిర్మించారు. ఈ మూవీలో విజువల్స్ పెంటాస్టిక్ గా వచ్చాయంటే కెమెరామెన్ రిషి పంజాబియే కారణం. సరైనోడు బ్లాక్ బష్టర్ అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...నేను ఈ సినిమా చేయడానికి కారణం బన్ని. నేను హీరోగా చేస్తూనే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్ లతో కలిసి నటించాను. బన్నితో ఎప్పటి నుంచో కలిసి నటించాలనుకుంటున్నాను. అరవింద్ గారు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పి నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలి అన్నారు ఓకే అన్నాను. ఇప్పటి హీరోలు ఎంత కష్టపడుతున్నారో బన్నిని చూసిన తర్వాత తెలిసింది. నేను అంత కష్టపడలేదు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అంతగా కష్టపడుతున్న బన్ని హ్యాట్సాఫ్. ఇక బన్ని ఏక్టింగ్ గురించి చెప్పాలంటే...ఇంటర్వెల్ సీన్ లో నాకు దెబ్బ తగిలినప్పుడు సెంటిమెంట్ సీన్ లో బన్నిఅద్భుతంగా నటించాడు. నా సినిమాలకు బోయపాటి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు . సెట్ లోనే డైలాగ్స్ రాసేసేవాడు. అప్పుడే పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను. ఇప్పడు బోయపాటితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆదిని విలన్ క్యారెక్టర్ లో చూసిన తర్వాత ఇండస్ట్రీకి స్టైలీష్ విలన్ దొరికాడు అనిపించింది అన్నారు.
ఆది మాట్లాడుతూ...బ్లాక్ బష్టర్ మూవీలో నటించిందకు హ్యాఫీగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. నా లైఫ్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఇన్ని కాల్స్ రాలేదు. ఈ క్యారెక్టర్ బాగా చేసానంటే ఆ క్రెడిట్ బోయపాటి గారికే చెందుతుంది. ఈ సినిమాకి వర్క్ చేయడం ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి.. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...ఇప్పటి వరకు నన్ను చూసి గ్లామర్ గా ఉంటుంది. స్టైలీష్ గా ఉంటుంది అనుకునేవారు. ఫస్ట్ టైమ్ మేకప్ లేకుండా ఈ చిత్రంలో నటించాను. మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు బోయపాటి గార్కి థ్యాంక్స్. మా పేరెంట్స్ ఈ మూవీ చూసారు. వాళ్లకి భాష తెలియక పోయినా అర్ధం చేసుకుని ఎమోషన్ సీన్స్ కి ఏడ్చేసారు. నాలోని కొత్తకోణాన్నిబోయపాటి గారు బయటకు తీసారు. బన్ని ఏక్టింగ్ చూసి ఫ్యాన్ అయిపోయాను అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...ఓరోజు బన్ని రకరకాల క్యారెక్టర్ చేసాను. కానీ...మాస్ గుండెల్లోకి చొచ్చుకుని వెళ్లలేదేమో అన్నాడు. నువ్వు అనుకున్నట్టు మాస్ ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళాలంటే...బోయపాటి ఉన్నాడు. నీకోసం అతన్ని కథ రెడీ చేయమని అడుగుతాను అని చెప్పాను. బన్నికి ఫ్యామిలీ ఆడియోన్స్ ఉన్నారు వాళ్లు మిస్ కాకుండా ఉండేలా కథ రెడీ చేయమన్నాను. మేము కోరుకున్నట్టే కథ రెడీ చేసాడు. బోయపాటి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు సినిమా గురించే ఆలోచిస్తాడు. సినిమాపై ఉన్న ఆ ఇంట్రస్టే అతనికి సక్సెస్ అందిస్తుంది. ఈ సినిమాకి ఫస్ట్ డే ఒకరకమైన టాక్ వచ్చింది. నెక్ట్స్ డే మార్నింగ్ పది గంటలకే అన్నిధియేటర్స్ లో సరైనోడు ఫుల్స్. మండే మ్యాట్ని ఆల్ షోస్ ఫాస్ట్ గా ఫుల్ అయ్యాయి. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధించిందో. బన్ని- బోయపాటి కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ సరైనోడు అన్నారు.
డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ....నేను ప్రతి సినిమాకి మొదటి సినిమాకి కష్టపడినట్టే కష్టపడతాను. నా మీద నమ్మకం పెట్టుకుని ఈ సినిమా ఇచ్చిన నా నిర్మాత కోసం తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలి అనుకున్నాను. అనుకున్నట్టే విజయం సాధించినందుకు హ్యాఫీగా ఉంది. లెజెండ్ అనే మంచి సినిమా చేసాను. ఆ సినిమా తర్వాత సరైన సినిమా చేయాలని రెండు సంవత్సరాలు వెయిట్ చేసి ఈ సినిమా చేసాను. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేసాను. ఈ మూవీకి బాబాయ్ క్యారెక్టరే ప్రాణం. పాత్రకు తగ్గట్టు శ్రీకాంత్ బాగా నటించారు. అలాగే ఆదికి మంచి జరగాలనే ఈ క్యారెక్టర్ చేయించాం. ఈ సినిమాకి వస్తున్న రెవెన్యూ చూసి..నా నిర్మాత అల్లు అరవింద్ గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఈ సినిమా చేయడానికి ఫస్ట్ కారణం బోయపాటి శ్రీను గారు. ఈ మూవీ ఫస్టాఫ్ లో వచ్చే కోర్టు సీన్ లో కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఆ సీన్ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మాకోసం ఈ మూవీలో క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ అన్నయ్యకి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఆది హీరోగా ఉండి విలన్ గా చేయడం అంటే చాలా డౌట్స్ ఉంటాయి. రిస్క్ తీసుకుని విలన్ గా చేసాడు. ఆదికి మంచి పేరు వచ్చినందుకు హ్యాఫీగా ఉంది. కేథరిన్... సినిమాలు చేస్తున్నాను కానీ సక్సెస్ రావడం లేదు అనేది. ఈ సినిమాతో కేథరిన్ కి హిట్ వచ్చింది. రకుల్ మంచి పర్ ఫార్మెర్. ఇందులో మహాలక్ష్మి క్యారెక్టర్ లో బాగా నటించింది. నేను ఒక గోల్ పెట్టుకుని ఈ సినిమా చేసాను. నేను ఏ లక్ష్యం తో ఈ సినిమా చేసానో అది నెరవేరింది. నాకు మాస్ సినిమాలంటే ఇష్టం. నన్ను మరింత మాస్ గా ప్రజెంట్ చేస్తారనే బోయపాటి గారితో ఈ సినిమా చేసాను. నేను అనుకున్నది రీచ్ అయినందుకు సంతోషంగా ఉంది.
ఈమూవీలో నాకు మంచి పేరు వచ్చిందంటే కారణం బోయపాటి గారే. ఇప్పటి వరకు నా లైఫ్ లో సినిమా కోసం బోయపాటి గారిలా కష్టపడే వాళ్లను చూడలేదు. మా అందరి కంటే బోయపాటి గారి కోసం ఈ సినిమా ఆడాలని కోరుకున్నాను. మా గీతా ఆర్ట్స్ సంస్థలో ఏ హీరోతో సినిమా చేస్తే...ఆ సినిమా వాళ్లకు హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మా సంస్థలో చిరంజీవి గారితో నిర్మించిన చిత్రాలు అప్పటికి హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచాయి. అలాగే మా సంస్థలో నిర్మించిన జల్సా పవన్ కళ్యాణ్ కి, మగథీర రామ్ చరణ్ కి, 100 % లవ్ నాగచైతన్యకి, భలే భలే మగాడివోయ్ నానికి హయ్యస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. అయితే మా సంస్థలో నేను చేసిన హ్యాఫీ, బద్రినాథ్ చిత్రాలు ఆశించిన స్ధాయిలో సక్సెస్ కాలేదు. సరైనోడు సినిమాతో మా సంస్థలో నేను విజయం సాధించడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్ని వాసు, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ డైరెక్టర్ సురేష్, బాబు, సత్య తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments