సరైనోడు స్పెషల్ సాంగ్ కోసం కోటిన్నర ఖర్చు..

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్నిబోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు స‌రైనోడు రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం స‌రైనోడు సినిమా కోసం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు. అల్లు అర్జున్ - కేథ‌రిన్ ల‌పై ఈ స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు.
ఈ సాంగ్ ఆడియోన్స్ కి ఓ విజువ‌ల్ ట్రీట్ లా ఉంటుంద‌ట‌. దాదాపు 300 మంది డాన్స‌ర్స్ పాల్గొంటున్న ఈ పాట చిత్రీక‌ర‌ణ మ‌రో మూడు రోజుల్లో పూర్త‌వుతుంది. ఈ సాంగ్ కోసం కోటిన్న‌ర ఖ‌ర్చు పెట్టి సెట్ వేసార‌ట‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథ‌రిన్ ఓ హీరోయిన్ కాగా...మ‌రో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా న‌ట‌కు అవ‌కాశం ఉన్న పాత్ర పోషిస్తుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ స‌రైనోడు సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

More News

పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందీప్

తమిళంలో సందీప్ కిషన్ హీరోగా సివికుమార్ దర్శక నిర్మాణంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ముందు తాప్పీని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు లావణ్య త్రిపాఠి సందీప్ సరసన జత కడుతుంది.

'శివగంగ' రిలీజ్ డేట్ మారింది...

కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ.

స‌ర్ధార్ ఆడియోకు అంత బ‌డ్జెట్టా

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

విజయ్ సరసన కీర్తి సురేష్...

తెలుగులో ఈ ఏడాది ‘నేను..శైలజ’చిత్రంతో సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్,ఇప్పుడు తమిళంలో ‘రజనీ మురుగన్’చిత్రంలో నటించి మెప్పించింది.

సమ్మర్ కి మరో మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్న సునీల్

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం కృష్ణాష్టమి.