సరైనోడు రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Friday,February 26 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందుతున్న స‌రైనోడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, కేథ‌రిన్ న‌టిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ పుట్టిన‌రోజైన ఏప్రిల్ 8న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే... ఏప్రిల్ 8న ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుండ‌డంతో స‌రైనోడు సినిమా రిలీజ్ డేట్ మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌రైనోడు సినిమాని ఏప్రిల్ 22న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్.ఎస్ త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న స‌రైనోడు ఆడియోను మార్చిలో గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నారు.