కొత్త అవ‌తారంలో స‌రైనోడు

  • IndiaGlitz, [Friday,February 12 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా స‌రైనోడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. స‌రైనోడు కొత్త అవతారంలో అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇంత‌కీ స‌రైనోడు కొత్త అవ‌తారం ఏమిట‌నుకుంటున్నారా..? స‌రైనోడు సినిమాలో బ‌న్ని సింగ‌ర్ గా మారి ఓ పాట పాడేసాడ‌ట‌. ఇటీవ‌లే ఎస్.ఎస్.త‌మ‌న్ నేతృత్వంలో బ‌న్ని పాడిన పాట‌ను రికార్డ్ చేసార‌ట‌.

నాటి నుంచి నేటి వ‌ర‌కు చాలా మంది హీరోలు ఇలా సింగ‌ర్ గా మారి అల‌రించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బ‌న్ని ఎలా పాడాడు.. ఏ పాట పాడాడు అనేది తెలియాలంటే స‌రైనోడు ఆడియో రిలీజ్ వ‌రకు ఆగాల్సిందే. గీత ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.