స‌రైనోడు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్..

  • IndiaGlitz, [Friday,April 29 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ చిత్రానికి ఫ‌స్ట్ మిశ్ర‌మ స్పంద‌న ల‌భించిన‌ప్ప‌టికీ...మాస్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో రూపొందిన స‌రైనోడు సినిమాకి ఫ‌స్ట్ నుంచి మంచి క్రేజ్ ఉంది.

ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టు స‌మ్మ‌ర్ హాలీడేస్ కూడా క‌ల‌సి రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రైనోడు సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడు. స‌రైనోడు ఫ‌స్ట్ వీక్ లో నైజాం 11.36 కోట్లు, సీడెడ్ 6.80 కోట్లు, కృష్ణా 2.28 కోట్లు, గుంటూరు 3.24 కోట్లు, నెల్లూరు 1.36 కోట్లు, తూర్పు గోదావరి 2.90 కోట్లు, పశ్చిమ గోదావరి 2.60 కోట్లు, వైజాగ్ 4.43 కోట్లు, కర్ణాటక 5.96 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.09 కోట్లు, ఓవర్సీస్ 3.70 కోట్లు మొత్తం 45.72 కోట్లు షేర్ సాధించడం విశేషం.