మాస్ పవర్ చూపించిన సరైనోడు
- IndiaGlitz, [Tuesday,May 31 2016]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరైనోడు. ఈ చిత్రానికి ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. ముఖ్యంగా అల్లు అర్జున్ను బోయపాటి పూర్తి స్థాయి మాస్ హీరోగా తీర్చిదిద్దిన విధానం బీ,సీ సెంటర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 22న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్స్ చూస్తే, అల్లు అర్జున్ రేంజ్ ఏమిటనేది ఇట్టే అర్థమైపోతుంది. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా 19 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి...అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పటికే హీరోగా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్, సరైనోడు సినిమాతో టాప్ లీగ్‌లో చేరిపోయారు.
సరైనోడు ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాం19 కోట్లు, సీడెడ్11 కోట్లు, కృష్ణా 4.05 కోట్లు, గుంటూరు 5.30 కోట్లు, నెల్లూరు 2.29 కోట్లు, తూర్పు గోదావరి 5.15 కోట్లు, పశ్చిమ గోదావరి4.40 కోట్లు, వైజాగ్ 8 కోట్లు, కర్ణాటక 8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60 కోట్లు, ఓవర్సీస్ 5.25 కోట్లు, తెలుగు + హిందీ సాటిలైట్ 16 కోట్లు.
ఇలా... సరైనోడు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక తెలుగు, హిందీ శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే 90 కోట్లకు పైనే వసూళ్ళు వచ్చాయని చెప్పుకోవచ్చు. స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ పవర్ ఎంత అనే దానికి నిదర్శనమే సరైనోడు కలెక్షన్స్..!