50 రోజులు పూర్తిచేసుకున్న సమ్మర్ బ్లాక్ బస్టర్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ 'సరైనోడు'
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు చిత్రం జూన్ 10వ తేదికి విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంటుంది. సరైనోడు చిత్రం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేస్తూ, ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. కలెక్షన్ల ప్రకారం టాలీవుడ్ టాప్ 5 చిత్రాల్లో సరైనోడు చిత్రం చోటు చేసుకుంది. చాలా ఏరియాల్లో సోలోగా నెం1 పోజిషన్స్ లో టాప్ టౌన్ రికార్డ్స్ క్రియెట్ చేసింది. 50 రోజులు పూర్తిచేసుకుని 100 రోజుల కి శరవేగంగా దూసుకుపోతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... సరైనొడు చిత్రం మా బ్యానర్‌లో అల్లు అర్జున్, రకూల్ ప్రీత్ సింగ్,కేథరిన్ కాంబినేషన్ లో బోయాపాటి శ్రీను దర్శకుడిగా నిర్మిచాము. సమ్మర్ కానుకగా విడుదల చేసిన మా చిత్రం మా అంచనాలు మించి విజయం సాధించింది. ముఖ్యంగా చూసిన ప్రతి ఓక్కరు బన్ని ఫెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. బన్ని చాలా మెచ్యుర్డ్ గా నటించాడని చెప్పారు. దానికి బన్ని చాలా కష్టపడి తన బాడీ లాంగ్వెజ్ ని ఈ పాత్రకు తగ్గట్టుగా మలుచుకుని చేశాడు. అలాగే బోయపాటి శ్రీను గారికి మాస్ పల్స్ బాగా తెలుసు బన్ని ని ఎలా చూపించాలో తెలిసిన వ్యక్తి కావటం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. థమన్ అందించిన ఆడియో సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రకూల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ లు ఇద్దరూ పోటాపోటిగా నటించి మెప్పించారు. అలాగే శ్రీకాంత్, జయప్రకాష్, సాయికుమార్‌లు సపోర్టివ్ పాత్రలో చాలా బాగా చేశారు. బ్రహ్మనందం, అన్నపూర్ణ , విద్యులేఖ చేసిన కామెడి మా చిత్రాన్ని ఫ్యామిలి ఆడియన్స్ కి దగ్గర చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. 50 రోజులు పూర్తిచేసుకుని 100 రోజులకి దూసుకుపోతుంది. ఈ ఘనవిజయం అందించిన ప్రపంచంలో వున్న తెలుగు ప్రేక్షకుల కి మా హ్రుదయ పూర్వక దన్యవాదాలు.. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com