సరైనోడు బ్లాక్ బష్టర్ సాంగ్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన సరైనోడు చిత్రం ఆడియోను ఏప్రిల్ 1న డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. చిలకలూరి చింతామణి..నా పేరంటే తెలియని వాళ్ళు లేరే జానీ...వయసు లెక్క సీక్రెటు కానీ..నన్ను అడగమాకే చారా వోణి... నే వచ్చేసా రయ్ మని సరకంతా ఇయమని...రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బష్టరే...అంటూ సాగే పాటను అల్లు అర్జున్, అంజలి పై చిత్రీకరించారు. ఈ పాటను ఈరోజు రిలీజ్ చేసారు. విన్న వెంటనే మాస్ ని అమితంగా ఆకట్టుకునేలా ఉంది ఈ స్పెషల్ సాంగ్. ఏప్రిల్ 10న వైజాగ్ లో సరైనోడు సినిమాకి సంబంధించిన వేడుక చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సరైనోడు సినిమాని ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com