'సర్కారువారి పాట' షూటింగ్ షురూ
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్, పరుశురామ్ కాంబినేషన్‌లో రూపొందతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మహేశ్ 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దుబాయ్‌లో సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వీడియో ప్రోమోతో తెలియచేయడమే 'ఆక్షన్ అండ్ యాక్షన్ బిగిన్స్' అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. నిజానికి ఈ సినిమాను మొదటి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించాలని ముందుగా అనుకున్నారు. అయితే, ప్రస్తుతం సినిమా ప్లానింగ్ పూర్తిగా మారింది. అందులో భాగంగా దుబాయ్‌లో సినిమా షూటింగ్‌ను షురూ చేశారు.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కించుకున్న మహేశ్.. సర్కారు వారి పాట చిత్రాన్ని ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది. కానీ కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి సమయం పడుతూ వస్తుంది. ఇందులో మహేశ్ ఎన్నారై బిజినెస్ మేన్‌గా, ఫైనాన్సియర్‌గా.. ఇలా రెండు షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
The Auction and the Action begins ?? #SarkaruVaariPaataShuru ??
— Mythri Movie Makers (@MythriOfficial) January 25, 2021
Super ?? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus#SarkaruVaariPaata ?? pic.twitter.com/qBgbcejAGS
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com