మహేష్ బర్త్ డే స్పెషల్‌గా ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మహేష్‌కు విషెస్ చెబుతూ మైత్రి మూవీ మేకర్స్ ‘సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్‌ను మాస్ లుక్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. విడుదల చేసిన మోషన్ పోస్టర్లో మహేష్ చెయ్యి వరకూ మాత్రమే చూపించారు. చేతికి ‘ఓం’ అనే తాడును ధరించాడు. మహేష్ ఓ రూపాయి కాయిన్‌ను ఎగురవేస్తున్నట్టుగా మోషన్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఈ చిత్రం మొత్తం రూపాయి చుట్టూ తిరుగుతుందనే ఓ మెసేజ్‌ను ఇచ్చినట్టుగా మోషన్ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. థమన్ మ్యూజిక్ ఈ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుందని భావిస్తున్నారు. ఏమాత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నవీన్ ఎర్నేని, రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments